No connection with drugs : తనకూ డ్రగ్స్‌కీ ఎలాంటి సంబంధం లేదన్న KTR.. ఏ పరీక్షకైనా రెడీ అంటున్న మంత్రి
Hyderabad Drug racket : తనకు డ్రగ్స్‌కీ ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఈ విషయంలో తాను ఏ పరీక్షకైనా సిద్ధమన్నారు. ఎవరో ఏదో చేస్తే తనకేమీ సబంధం అని ప్రశ్నించారు.
I have no connection with drugs, ready for drug test: KTR : తనకూ డ్రగ్స్‌కీ ఎలాంటి సంబంధం లేదన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో తాను ఏ పరీక్షకైనా రెడీ అన్నారు మంత్రి. తెలంగాణలో ప్రతిపక్షాలకు ఏ పనిలేకే తమపై బురదజల్లుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికను (huzurabad by election) అసలు పట్టించుకోనవసరం లేదన్నారు కేటీఆర్. అక్కడ ఎలాగో టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు (congress) డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదన్నారు.
ఏ పరీక్షకైనా సిద్ధం
తమ ప్రభుత్వం సంక్షేమంలో నిమగ్నమైందన్నారు. రూ.50కోట్లతో పీసీసీ కొనుక్కున్నారని ఆ పార్టీ నేతే అన్నారని కేటీఆర్ సెటైర్ వేశారు. మరి పీసీసీ (PCC) పదవి కొనుక్కున్న నేత రేపు ఎమ్మెల్యే టిక్కెట్టు అమ్ముకోరా అంటూ ప్రశ్నించారు. పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఇళ్లు ఎలా వచ్చాయన్నారు. ఒకప్పుడు సున్నమేసిన వ్యక్తి.. ఇవాళ కన్నమేస్తున్నారని ఆరోపించారు. తనకు డ్రగ్స్‌కీ ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఈ విషయంలో తాను ఏ పరీక్షకైనా సిద్ధమన్నారు. ఎవరో ఏదో చేస్తే తనకేమీ సబంధం అని ప్రశ్నించారు.
Also Read : Breaking news: టాలీవు డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ కు క్లీన్ చిట్...
ఇక నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరించారు.ఎంఐఎంకు తామేమీ భయపడట్లేదని, బీజేపీనే (BJP) భయపడుతోందని అన్నారు. తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులపై అమిత్ షా (Amit Shah) మాట్లాడాలి అన్నారు. బీజేపీ నుంచి ఎంపీలుగా గెలిచిన వారు తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. అడ్రస్‌లేని వ్యక్తులంతా సీఎం కేసీఆర్‌ని తిడితే ఊరుకోమని కేటీఆర్ (KTR) హెచ్చరించారు.
Also Read : Bigg Boss 5 Telugu: శ్రీరామ చంద్ర చేసిన Prize money కామెంట్స్‌పై నెటిజెన్స్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook