Nakrekal: కేసీఆర్, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటా
Komatireddy Rajgopal Reddy Challenge To KCR KTR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెచ్చిపోయారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు.
Komatireddy Challenge: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. 'కేసీఆర్, కేటీఆర్‌ను జైలుకు పంపుతా' అని ప్రకటించారు. కేసీఆర్ కుమార్తె కవిత తిహార్ జైల్లోనే బతుకమ్మ పండుగ చేసుకుంటుంది అని ఎద్దేవా చేశారు.
Also Read: BRS Party: గులాబీ పార్టీకి భారీ దెబ్బ.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి
భువనగిరి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నకిరేకల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో రాజగోపాల్ పాల్గొన్నారు. 'తొమ్మిదిన్నరేళ్లు బీఆర్ఎస్ పార్టీ పాలనలో కేసీఆర్ ప్రజలను మోసం చేసి అక్రమంగా దోచుకున్నదంతా తిరిగి రాబడతాం' అని కోమటిరెడ్డి రాజగోపాల్ తెలిపారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్‌లు కూడా జైలుకు ఖాయం. వారిని జైలుకు పంపకపోతే నా పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాదు' అని సంచలన సవాల్ విసిరారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు.
Also Read: Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?
తెలంగాణ ప్రజలు ధర్మం వైపే ఉన్నారని అందుకే కేసీఆర్‌ను గద్దె దింపి ప్రజాపాలనను అధికారంలోకి తీసుకొచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను పదవులు అడుక్కోనని.. లాక్కుంటానని తెలిపారు. 'నేను మంత్రి కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. అంతేకాదు హోంమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. నేను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలను మొదట జైలుకు పంపుతా. నేను హోంమంత్రి కావద్దని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారు' అని చెప్పారు. ఈ సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter