Smitha Sabharwal: తెలంగాణ జరూర్ ఆనా.. స్మితా సబర్వాల్ స్పెషల్ వీడియో!
Smitha Sabharwal: ఆమె ఓ ఫైర్ బ్రాండ్ ఆఫీసర్..! ప్రభుత్వం ఏదైనా తన మార్క్ పాలనతో దూకుడు చూపిస్తున్నారు..! గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎంవో సెక్రటరీగా పనిచేసిన ఆమె.. ప్రస్తుత ప్రభుత్వంలో టూరిజం సెక్రటరీగా పాలన బాధ్యతలు స్వీకరించారు..! అయితే చార్జ్ తీసుకున్న తక్కువ సమయంలోనే టూరిజం పాలసీని రూపొందించి ఔరా అనిపించారు. ఇప్పుడు తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, ఇక్కడి పర్యాటకంపై సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. తెలంగాణ- జరూర్ ఆనా పేరుతో ఓ వీడియో తెగ ట్రెండింగ్ అవుతోంది. టూరిజం బ్రాండ్‌ను మరోస్థాయిలో ప్రమోట్ చేస్తున్న ఆ ఆఫీసర్ ఎవరు..!
Smitha Sabharwal: తెలంగాణలో స్మితా సబర్వాల్ పేరు తెలియని వారుండరు. గ్లామరస్ ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంత గుర్తింపు పొందారో.. అంతకుమించిన అడ్మినిస్ట్రేటర్‌గా గుర్తింపు దక్కించుకున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అయినా.. ప్రస్తుత సర్కార్‌లో అయినా.. తనదైన మార్క్ పాలన సాగిస్తున్నారు. గతంలో స్మితా సబర్వాల్ పనితీరును మెచ్చుకుని సీఎంవో సెక్రటరీగా నియమించుకున్నారు కేసీఆర్.. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో స్మితా సబర్వాల్ కొన్ని నెలలపాటు లూప్‌లైన్‌లోకి వెళ్లిపోయారు. కొద్దిరోజులు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్‌లో పనిచేశారు. అక్కడ తనదైన పనితీరుతో అందరినీ అకట్టుకున్నారు. అయితే ఆమె సేవలను మరింత విస్తృతం చేయాలన్న సంకల్పంతో రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో టూరిజం శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించింది. అయితే ఈ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే స్మితా సబర్వాల్‌కు మహారాష్ట్ర ఎన్నికల్లో స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేసే చాన్స్‌దక్కింది. అక్కడ తనదైన పనితీరు కనబరిచారు ఆమె.. ఓ వైపు ఎన్నికల బిజీగా ఉంటూనే.. కాస్తా విరామం దొరికితే చాలు.. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలను చుట్టివచ్చారు. అక్కడ తాను పర్యటించిన ఆలయాలు, పర్యాటక ప్రాంతాల గురించి తన సోషల్ మీడియాలో ఫ్లాట్‌పామ్‌లో వివరించారు. ఆ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చేసి బిజీబిజీ అయిపోయారు. ప్రస్తుతం టూరిజం శాఖలో స్మితా సబర్వాల్ తనదైన దూకుడు చూపిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి టూరిజం పాలసీ లేదన్న విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆదేశాల మేరకు కేవలం అతి తక్కువ సమయంలోనే కొత్త టూరిజం పాలసీని రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. దాంతో అసెంబ్లీ సమావేశాల్లో టూరిజం పాలసీపై ప్రత్యేక చర్చ జరిగింది.
వాస్తవానికి తెలంగాణలో ఉన్న ఫైర్ బ్రాండ్ ఆఫీసర్లలో స్మితా సభర్వాల్ ఒకరు.. ఆమె ఏదీ చేసినా సంచలనమే. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆమె మిషన్ భగీరథపై ప్రత్యేక చొరవ చూపడం వల్లనే తెలంగాణలోని ప్రతి పల్లెకు శుభ్రమైన తాగునీరు అందుతోంది. అంతకుముందు మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలోనూ తనదైన మార్క్ పాలనను చేసి చూపించారు. అందుకే అప్పటి సీఎం కేసీఆర్ ఏరికోరి ఆమెను సీఎంవోలో సెక్రటరీగా నియమించుకున్నారు. ఇక గతేడాది రాష్ట్రంలో సర్కార్ మారడంతో స్మితా సబర్వాల్ సీఎంవో నుంచి టూరిజం శాఖకు బదిలీ అయ్యారు. ఇక్కడ అదే ఫైర్ చూపిస్తున్నారు. టూరిజం శాఖలో అధికారులను ఆమె నిత్యం పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో టూరిజం మరింత మెరుగు పడాలి.. ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు తెలంగాణకు రావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఇవన్నీ సాధ్యపడాలంటే మనమంతా కష్టపడాలని అధికారులకు సుతిమెత్తగా ఆదేశిస్తున్నారట. అలాగే రాష్ట్రంలో గుర్తింపుకు నోచుకుని చారిత్రక ప్రదేశాలు ఏమైనా ఉంటే చెప్పాలని అధికారులకు సూచిస్తున్నారట. దాంతో స్మితా స్పీడ్‌ను చూసిన అధికారులు స్మితా మేడమ్ నిజంగానే ఫైర్ అంటున్నట్టు తెలిసింది.
వాస్తవానికి తెలంగాణలోని అనేక ప్రాంతాలకు చారిత్రక నేపథ్యం ఉంది. ఇందులో చాలా ప్రాంతాలు టూరిజం స్పాట్‌లుగా వేటికవే ప్రత్యేకం.. ఇలా రాష్ట్రమంతటా అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.. అలాగే తెలంగాణ ప్రాంతంలో అనేక ఆలయాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా యాదాద్రి ఆలయం గురించి చెప్పుకోవాలి. గత ప్రభుత్వం యాదగిరి గుట్టను ప్రత్యేకంగా అభివృద్ది చేయడంతో ఆలయం రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. అటు రామప్ప ఆలయం కూడా తెలంగాణకు స్పెషల్ అనే చెప్పాలి. ఇటు నదుల పరవళ్లు, తెలంగాణ రుచులు, హైదరాబాద్ బిర్యానీ ఇలా దేనికదే ప్రత్యేకం. మరోవైపు తెలంగాణలో భోనాలు, బతుకమ్మ పండుగలు మరింత స్పెషల్. అయితే వీటన్నింటికీ సరైనా ప్రచారం లేకపోవడంతో పర్యాటకులకు తెలిసేది కాదు. దాంతో టూరిజం పరంగా హైదరాబాద్ వెనకబడింది. కానీ.. స్మితా సబర్వాల్ టూరిజం శాఖ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించాక మాత్రం ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
అయితే ప్రభుత్వ పరంగా టూరిజం పాలసీ రూపొందించడంతోనే స్మితా సబర్వాల్ పని అయిపోలేదు. తాజాగా తెలంగాణ టూరిజం శాఖ రూపొందించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా బయటకు వదిలారు మేడమ్ స్మితా.. తెలంగాణ- జరూర్ ఆనా యాష్ ట్యాగ్‌తో ఆమె వదిలిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తెలంగాణలో ప్రముఖ ప్రాంతాల సమాచారాన్ని వివరించారు. దాతో వీడియో చూసిన నెటిజన్లు లైక్‌లు కామెంట్స్‌తో తెగ మెచ్చుకుంటున్నారు. తెలంగాణలో ఇలాంటి అద్బుతమైన ప్రాంతాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. కొందరైతే వీడియో చూసిన వెంటనే ఈ ప్రాంతాన్ని మేం వెంటనే సందర్శించాలని అనుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు స్మితా సబర్వాల్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్ చెబుతున్నారు. తెలంగాణ టూరిజం తరఫున ఇలాంటి అద్భుతమైన వీడియో రూపొందించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు.. మొత్తంగా టూరిజం డిపార్ట్‌మెంట్ స్మితా సబర్వాల్ చేతిలో పడ్డాక.. దాని రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో స్మితా మేడమ్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో..!
Also Read: AP New Airports: ఏపీలో మరో 7 కొత్త విమనాశ్రయాలు, ఎక్కడెక్కడో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook