AP New Airports: ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాలు నిర్మించనుంది. కొత్త విమానాశ్రయాలు నిర్మాణం, అభివృద్ధిపై చంద్రబాబు సంబంధిత అధికారులతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమీక్షించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 6 విమనాశ్రయాలకు తోడు మరో 8 విమానాశ్రయాలు రానున్నాయి.
దేశంలో ఏ రాష్టంలో లేనివిధంగా ఏపీలో అటు పోర్టులు, ఇటు విమానాశ్రయాలు అభివృద్ధి కానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో 4-5 పోర్టుల నిర్మాణం తలపెట్టింది. ప్రస్తుతం ఇవన్నీ అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 7 కొత్త విమానాశ్రయాలపై దృష్టి సారించింది. ఏపీలో ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, కర్నూలు విమానాశ్రయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండగా భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా నిర్మాణమౌతోంది. ఇప్పుడు కొత్తగా 7 విమానాశ్రయాలు నిర్మించనున్నారు. ఈ విషయమై ఇప్పటికే చంద్రబాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు అధికారులతో చర్చించారు.
చిత్తూరు జిల్లా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లి గూడెం, నాగార్జున సాగర్ , తుని-అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయదలిచారు. ఈ ఏడు విమానాశ్రయాల్లో ఇప్పటికే భూసేకరణ కొద్గిగా పూర్తయింది. దగదర్తి విమానాశ్రయానికి సంబంధించి మొత్తం 1379 ఎకరాల్లో 635 ఎకరాల సేకరణ పూర్తయింది. పల్నాడు జిల్లా నాగార్జుల సాగర్‌లో 1670 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించదలిచారు. అదే విధంగా తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాల్లో మరో విమనాశ్రయం నిర్మించనున్నారు. ఇక కుప్పంలో1250 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణం కోసం భూసేకరణ ప్రారంభమైంది.
Also read: AP Pensions Verify: ఏపీలో బోగస్ పెన్షన్ల ఏరివేత, ఎప్పట్నించి వెరిఫికేషన్ ఎలా చేస్తారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.