హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు బంగాళాఖాతం, దాని పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణిలో విలీనమైంది. దీంతో ముందు నుంచి అంచనా వేసినట్లుగా అల్పపీడనం ఏర్పడదని వాతావరణ నిపుణులు తెలిపారు. 


ఇదిలావుంటే ఉత్తర భారత దేశంలో పలు రాష్ట్రాల్లో గడిచిన మూడు, నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు నదులు, కాలువల్లోకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగగా భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది.