Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో నెరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో అన్ని జిల్లాల్లోనూ వానలు కురుస్తున్నాయి. కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ గాలుల్లో అస్థిరత కారణంగా 1500 మీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రుతుపవనాలు మరింత చుర్రుగా కదులుతున్నాయని వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆది, సోమవారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో తెలంగాణ రాష్ట్రంలోని  పలు జిల్లాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిస్తాయని వెల్లడించింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌‌,​ ఉమ్మడ్ నిజామాబాద్‌‌, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ తో పాటు మేడ్చల్  మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోన వానలు పడతాయి. హైదరాబాద్ లో ఆదివారం కూల్ వాతావరణం ఉంది.


శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నిజామాబాద్​లోని జక్రాన్‌‌పల్లిలో అత్యధికంగా 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.  మదనపల్లెలో 5.5, గద్వాలలోని ధరూర్​లో 5, నల్గొండలోని కనగల్‌‌లో 4, సంగారెడ్డిలోని రాయికోడ్‌‌లో 3.9 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.


Read also: KTR MEET JUPALLI: అసంతృప్త నేతలకు తాయిలాలు.. బుజ్జగింపులు! టీఆర్ఎస్ లో కొత్త సీన్... కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా?


Read also: Agnipath Riots: ఫైర్ చేసింది తెలంగాణ పోలీసులా.. రైల్వే పోలీసులా? రాజకీయ కుట్ర జరిగిందా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏం జరిగింది? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook