Heavy Rains Alert: మొన్నటి వరకూ ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్ని గత మూడ్రోజుల్నించి కురుస్తున్న భారీ వర్షాలు తీర్చేసినట్టే కన్పిస్తోంది. గత మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు..వచ్చే మూడ్రోజులు కూడా అదే పరిస్థితి కొనసాగనుందని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని సూచించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో ఇప్పుడు ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. గత మూడ్రోజుల్నించి ఇదే పరిస్థితి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నిరంతరం కురుస్తూనే ఉన్నాయి. ఫలితంగా తెలంగాణలో ఏర్పడిన వర్షపాతం లోటు తీరినట్టేనంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు తప్పవని ఐఎండీ సూచించింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అందుకే కొన్ని జిల్లాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది. 


రాష్ట్రంలో జలాశయాల నీటిమట్టం వివరాలు


గదత మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు 87,440 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కాగా, అవుట్ ఫ్లో కూడా అంతే ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20 టీఎంసీలు కాగా, ఇప్పటికే 19.73 టీఎంసీలకు చేరుకుంది. ఇక పార్వతీ బ్యారేజ్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 32,736 క్యూసెక్కులు ఉంటుంది. ఇక ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 500 క్యూసెక్కులుంది. నీటిమట్టం 1784.20 అడుగులకు చేరుకుంది. ఇక హిమాయత్ సాగర్ ఇన్ ఫ్లో 400 క్యూసెక్కులు కాగా నీటిమట్టం 17650.25 అడుగులకు చేరుకుంది.


గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రామగుండం ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలోకి భారీగా వరద నీరు చేరింది. 


Also read: Holidays in Telangana Due to Rains: భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి సెలవులు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook