Kalyana Lakshmi Corruption: గత బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం అమలుచేసిన అద్భుతమైన పథకాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌. ఈ పథకం కింద పెళ్లి చేసుకుంటున్న యువతి కుటుంబానికి కొంత ఆర్థికంగా సహాయం చేసే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ఈ మానవతా పథకంలో అవినీతి జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ పథకం అమలులో మీనమేషాలు లెక్కిస్తున్న వేళ ఈ పథకంలో అవినీతి జరుగుతోందని వార్త కలకలం రేపింది. ఈ ఆరోపణలు సాదాసీదా వ్యక్తులు కాదు ఏకంగా ఎమ్మెల్యే చేయడం చర్చనీయాంశంగా మారాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!


 


హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల అమలులో ప్రభుత్వ సిబ్బంది చేతివాటం చూపిస్తోందని ఆరోపించారు. లబ్ధిదారుల వద్ద మండల కార్యాలయం సిబ్బంది లంచం తీసుకుంటున్నారని తెలిపారు. చెక్కుకు పదివేల చొప్పున లంచం తీసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహారిస్తున్న ఉదాసీన వైఖరిపై మండిపడ్డారు.

Also Read: Oyo Room Hotel: ఓయో రూమ్‌లో ప్రేమ జంటకు భారీ షాక్‌.. గదిలో సీక్రెట్‌ కెమెరాలు


 


'లబ్ధిదారులకు చెక్కులు అందించేందుకు ఖైరతాబాద్ మండల కార్యాలయం సిబ్బంది చెక్కుకు రూ.పది వేల చొప్పున లంచం తీసుకుంటున్నారు' అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆరోపించారు. ఈ విషయం బయట పడకుండా ఉండడానికి చెక్కుల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ విస్మరించడంతోపాటు ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను తప్పుదో పట్టిస్తున్నారని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాత్రమే పంపిణీ చేయాలని జీవో ఉండడంతోపాటు గతంలో హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 'ఇది పరిగణలోకి తీసుకొని చెక్కుల పంపిణీ చేపట్టాలి' అని ఎమ్మెల్యే హితవు పలికారు.


ముఖ్యమంత్రి ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకే వెళ్లాలని చెబుతుండగా రెవెన్యూ అధికారులు మంత్రిని తప్పుదోవ పట్టిస్తూ లబ్ధిదారులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే కలెక్టర్, అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. పేదలకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో అందించే ఈ పథకాల్లోనూ అవినీతి పాల్పడడం దారుణంగా పేర్కొన్నారు. వెంటనే సక్రమంగా ఈ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన తులం బంగారం కూడా ఇవ్వాలని కోరారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter