Yadadri KCR Tour: తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.  నవ్యవ యాదాద్రిని సీఎం కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. రుత్వికుల సమక్షంలో మహాకుంభ సంప్రోక్షణ అట్టహాసంగా జరిగింది. మరోవైపు యాదాద్రుడి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షన మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. దివ్య విమాన గోపురంపై సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. పవిత్ర జలాలతో అభిషేకం చేశారు సీఎం కేసీఆర్. సీఎంకు కంకణధారణ చేసి పండితులు ఆశీర్వచనం అందించారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. రాజ గోపురాలపై స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ చేపట్టారు. విమాన గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించి.. తీర్థ ప్రసాదాలను అందజేశారు. 


మహాకుంబ సంప్రోక్షన మహోత్సవం తర్వాత ప్రధానాలయ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. జయ జయ ధ్వానాల మధ్య ఈఘట్టం సాగింది. ఆలయ ప్రవేశం జరిగిన సమయంలో నమో నారసింహ మంత్రం ప్రతి ధ్వనించింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.


ఆలయ పునర్ నిర్మాణంలో భాగస్వామ్యమైన ఆలయ ఈవో గీత, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, స్థపతి సుందర్‌రాజన్, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్‌రావును సీఎం కేసీఆర్ సత్కారించారు. ఇతర అధికారులను మంత్రులు సన్మానించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ను ఆలయ ఈవో గీత, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్‌రావు శాలువాతో సత్కరించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఫోటోను బహుకరించారు. 



ఆరేళ్ల తర్వాత యాదాద్రి పునఃప్రారంభం కావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చొరవను అభినందిస్తున్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని చెబుతున్నారు.


Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కి భారీ షాక్.. మరో స్టార్ ప్లేయర్ ఔట్!!


Also Read: Vijay-Puri: విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబోలో మరో మూవీ.. రేపే లాంచింగ్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook