విద్యార్థులకు, నిరుద్యోగులకు నిత్యం ఏదో ఓ సందర్భంలో అవసరమయ్యే డాక్యుమెంట్ ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (Income Certificate). ఇన్‌కమ్ సర్టిఫికెట్‌ను తేలికగా అందించాలని తెలంగాణ (Income Certificate In Telangana) ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు రెవెన్యూ శాఖలో సంస్కరణలు సైతం చేపట్టేందుకు టీఆర్ఎస్ సర్కార్ క‌స‌ర‌త్తులు మొదలుపెట్టింది. రెవెన్యూ కార్యాలయాలలో ధ్రువీకరణ పత్రాల కోసం లంచాల వరకు వెళ్లకుండా ఉండేందుకు, అవినీతి అరికట్టేందుకు అధికారులు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు.  Vijayawada fire Accident విషాదం: 11కి చేరిన మృతుల సంఖ్య


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక నుంచి మీసేవ ద్వారా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే దిశగా తెలంగాణ సర్కార్ పని ప్రారంభించింది. టెక్నాలజీని వాడుకుని ఆన్‌లైన్ ద్వారా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే దిశగా సంస్కరణలు చేపడుతున్నారు. ముందుగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (ఇన్‌కమ్ సర్టిఫికెట్స్) కావాలనుకునే వారు తమ వివరాలు అందించి ‘మీ సేవ’ ద్వారా సులువుగా పొందవచ్చు. రానా పెళ్లిపై Rajamouli అంచనా నిజమైంది


ప్రజలు అధికారులను కలవకుండానే సర్టిఫికెట్స్ పొందడం అంటే.. లంచాలు, అవినీతి తగ్గుతుందని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.  
ఫిర్యాదుల పరిష్కారానికి ‘గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ సిస్టమ్’ పేరుతో ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేయనున్నారు. సోషల్ మీడియా ద్వారాగానీ, అధికారిక పోర్టల్‌లో గానీ బాధితులు ఫిర్యాదులతో పాటు తమ అభిప్రాయాన్ని షేర్ చేసే అవకాశం కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి.  హాట్ ఫొటోలతో కవ్విస్తున్న బొద్దుగుమ్మ..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...