IT Raids On Chatnys Restaurant On Sharmila Daughterinlaw Hotel: ప్రముఖ అల్పాహారా సంస్థ చట్నీస్ సంస్థకు బిగ్ ట్విస్ట్ ఎదురైంది.  ఆసంస్థకు చెందిన అనేక చట్నీస్ టీఫిన్ సెంటర్లపై ఏకకాలంలో ఐటీ అధికారులు నిర్వహించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజకీయాలల్లో రచ్చగా మారింది. చట్నీస్ సంస్థ  యజమాని అట్లూరీ పద్మ, ఏపీకాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు వియ్యంకురాలు. ఇటీవల రాజస్థాన్ లో అట్లురీ ప్రియ, వైఎస్  రాజరెడ్డి ల పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిలా చాలా దూకుడుగా ముందుకుపోతున్నారు. సొంత అన్నను సైతం పెళ్లికి పిలవకుండా అందరికి షాక్ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..


ఇక ఏ మీటింగ్ జరిగిన.... ఎక్కడ ర్యాలీలలో పాల్గొన్న కూడా అన్న వైఎస్సార్పీపీ అధినేత వైఎస్ జగన్ పై విమర్శలు సంధిస్తున్నారు. ఇక.. బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీలు ఒకటేనని, ఆమె పలుమార్లు ఆరోపించారు. ఏపీలో పదేండ్లపాటు రాజధాని లేకుండా, అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజలను మోసం చేశారని షర్మిలా ఎద్దేవా చేశారు. విభజన ఫలాలు ఏపీకి  అందించడంలో పార్టీలన్ని విఫలమయ్యారని షర్మిల అన్నారు.


ఏపీ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తో ప్రత్యేక హోదాపై తొలిసంతకం పెట్టేలా చూస్తామన్నారు. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ పాలనలో రైతులు పంటలు పండకుండా నష్టపోయారని, ఉద్యోగాలు లేక స్టూడెంట్స్ సూసైడ్ లకు పాల్పడుతున్నారని విమర్శలు సంధించారు. జనసేత, టీడీపీ, బీజేపీ పొత్తులపై కూడా షర్మిల పలుమార్లు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఆలోచించి ఓటువేయాలని పేర్కొన్నారు.


Read more: Viral News: ఇదెక్కడి కరువురా నాయన.. సోదరుడిని పెళ్లాడిన మహిళ.. ట్విస్ట్ ఏంటంటే..?


ఇదిలా ఉండగా.. ఇప్పుడు కేంద్రంలో పాటు, రాష్ట్రంలో అధికారంలో ప్రభుత్వాలు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నాయని షర్మిలా ఆరోపించారు. కేంద్రంలో ఉన్న పార్టీలో చేరితే.. ఈడీ, ఐటీ దాడులు ఉండవని, వారికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం ఈడీ, ఐటీ అధికారులు, దర్యాప్తుసంస్థలను ఉసిగొల్పి దాడులకు పాల్పడుతున్నారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చట్నీస్ సంస్థపై ఐటీ అధికారులు దాడిచేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook