Passport Tips: ఇలా అప్లై చేస్తే కేవలం 5 రోజుల్లోనే పాస్‌పోర్ట్

Passport Tips: ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే తప్పకుండా ఉండాల్సిన మొదటి డాక్యుమెంట్ పాస్‌పోర్ట్ మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ పాస్‌పోర్ట్ కలిగి ఉంటారు. ఒక్కోసారి పాస్‌పోర్ట్ లభించడం కష్టమైపోతుంటుంది. అకారణంగా రిజెక్ట్ అవుతుంటుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 19, 2024, 01:36 PM IST
Passport Tips: ఇలా అప్లై చేస్తే కేవలం 5 రోజుల్లోనే పాస్‌పోర్ట్

Passport Tips: మీక్కూడా పాస్‌పోర్ట్ విషయంలో ఇబ్బందులు ఎదురౌతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సూచనలు పాటిస్తే చాలా సులభంగా ఆన్ లైన్ విధానంలో కేవలం 5 రోజుల్లో పాస్‌పోర్ట్ పొందవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..నిజమే..ఎలాగో తెలుసుకుందాం.

దేశంలో అత్యుత్తమమైన సిటిజన్ షిప్ ఐడీ పాస్‌పోర్ట్. విదేశాలకు వెళ్లేందుకు కావల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్. గతంలో అయితే పాస్‌పోర్ట్ అప్లై చేసేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. అప్లై చేసిన 3-4 నెలలకు కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దాదాపు ప్రతి ప్రాంతంలోని పోస్టాఫీసులో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు తెర్చుకున్నాయి. పాస్‌పోర్ట్ అప్లై చేసిన 10-15 రోజుల్లో వచ్చేస్తుంది. ఒక్కోసారి మాత్రం పాస్‌పోర్ట్ పొందడం కష్టమౌతుంటుంది. పాస్‌పోర్ట్ రెడీ చేసుకోవడంలో సమస్యలు ఎదురౌతుంటాయి. ఎప్పుడైనా వేరే దేశానికి అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే పాస్‌పోర్ట్ లేకపోతే ప్రయాణం నిలిచిపోతుంటుంది. 

అత్యవసరంగా పాస్‌పోర్ట్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ తత్కాల్ పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తత్కాల్ పాస్‌పోర్ట్ కేవలం 5 రోజుల్లోనే వచ్చేస్తుంది. అయితే కాన్సులేట్‌కు మీ దరఖాస్తు చేరిన సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటే నెల రోజులు పట్టేస్తుంటుంది.

అయితే తత్కాల్ కోసం అందరూ అప్లై చేయడానికి వీల్లేదు. చిన్నారులు, తల్లిదండ్రుల్లేని మైనర్ పిల్లలు, సరోగసీ పిల్లలు తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం అనర్హులు. మీ పాస్‌పోర్ట్ పోయినా లేదా దొంగతనమైనా సరే తత్కాల్ కింద అప్లై చేయలేరు. పాస్‌పోర్ట్ చేయించుకోవాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ పాస్‌పోర్ట్‌కు అప్లై చేయడం, రెండవది తత్కాల్ పాస్‌పోర్ట్. సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు 1500 రూపాయలు కాగా తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు 3500 రూపాయలుంటుంది. అర్జెంటుగా పాస్‌పోర్ట్ అవసరమైతే మాత్రం తత్కాల్ పాస్‌పోర్ట్ బెస్ట్ ఆప్షన్. కేవలం 5 రోజుల్లో వచ్చేస్తుంది.

Also read: Costly Gift: నాలుగు నెలల బుడ్డోడికి 240 కోట్ల బహుమతిచ్చిన తాతయ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News