Independence Day: కేసీఆర్ బాటలోనే రేవంత్.. గోల్కొండలోనే స్వాతంత్ర్య సంబరాలు
Revanth Reddy Hoists National Flag Like KCR In Golconda Fort: పదేళ్లుగా కొనసాగుతున్నట్టుగానే స్వాతంత్ర్య సంబరాలు గోల్కొండ కోటలోనే జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చకాచకా చేస్తోంది.
Independence Day 2024: స్వాతంత్ర్య దినోత్సవం యథావిధిగానే గోల్కొండ కోటలోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన అనంతరం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య సంబరాలు జరపడం ప్రారంభించారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఆనవాయితీని కొనసాగించనుంది. స్వాతంత్ర్య వేడుక ఏర్పాట్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గోల్కొండ కోటలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నారు.
Also Read: KTR vs Rahul Gandhi: సుంకిశాలపై మాటల యుద్ధం.. రాహుల్ గాంధీని లాగిన కేటీఆర్
అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్లుపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండలో జరుగనున్న స్వాతంత్ర్య సంబరాల ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు. గోల్కొండ కోటను సోమవారం సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీఐపీలు రానున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్‌పై దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు చెప్పారు.
Also Read: Chandrababu: ప్రతి రెండో శనివారం తెలంగాణకు టైమ్ ఇస్తా: చంద్రబాబు
స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే సాంస్కృతిక బృందాల, కళా బృందాల ప్రదర్శనపై అధికారులతో సీఎస్ చర్చలు జరిపారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తులలో కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ తెలిపారు. గుస్సాడి, కొమ్ము కోయ, లంబాడీ, డప్పులు, ఒగ్గు డోలు, కోలాటం, బోనాలు కోలాటం, బైండ్లోల జమిడికలు, చిందు యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేర్ని వంటి వివిధ కళారూపాలకు చెందిన వెయ్యి మందికి పైగా కళాకారులతో ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రణాళికలు రచించారు.
ప్రభుత్వం యూటర్న్?
రాజరికపు పోకడలు అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి స్వాత్రంత్య సంబరాలను మాత్రం గోల్కొండ కోటలోనే నిర్వహించనుండడం విశేషం. ప్రభుత్వ అధికార చిహ్నం రాజరికపు చిహ్నం అని పేర్కొంటున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు గోల్కొండ కోటలోనే స్వాతంత్ర్య సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. గోల్కొండ రాజరికపు చిహ్నం కాదా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లోగోల మార్పు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గోల్కొండలోనే ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter