తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వచ్చే విద్యా సంవత్సరం (TS Inter Academic Calendar)లో 46 పని దినాలు తగ్గించింది. 2020-21 విద్యా సంవత్సరంలో 228 పని దినాలను 182కు బోర్డు కుదించింది. కరోనా కారణంగా కాలేజీలు నడవకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. మార్చి 24 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు (TS Inter Exams From March 24) నిర్వహించనున్నట్లు ప్రకటించారు. TS POLYCET Result 2020: తెలంగాణ పాలిసెట్ 2020 ఫలితాలు విడుదల


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దసరా సెలవులను అక్టోబర్ 23 నుంచి 25వరకు మూడు రోజులు, సంక్రాంతి సెలవులను జనవరి 13, 14 తేదీలకు తగ్గించారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే జూనియర్ కాలేజీలలో అడ్మిషన్లు ప్రారంభించాలని, అదే సమయంలో ప్రైవేట్ కాలేజీలలో పీఆర్వో వ్యవస్థను ఇంటర్ బోర్డు నిషేధించింది. వీటితో పాటు కాలేజీల యాడ్స్ సంబంధించిన బోర్డులు, ప్లెక్సీలు, కరపత్రాలు, గోడలపై కాలేజీ ఓపెనింగ్స్ వివరాలు రాయడంపై నిషేధం విధించింది. Kisan Rail: అనంతపురం నుంచి ఢిల్లీ చేరిన తొలి కిసాన్ రైలు


తెలంగాణ ఇంటర్‌ బోర్డు 2020-21 విద్యా సంవత్సరం క్యాలెండర్‌..


  • పనిదినాలు - 182

  • క్లాసులు ప్రారంభం - సెప్టెంబర్‌ 1, 2020

  • చివరి పనిరోజు -  ఏప్రిల్‌ 16, 2021

  • ప్రి ఫైనల్‌ ఎగ్జామ్స్ -  ఫిబ్రవరి 22 నుంచి 27, 2021

  • ప్రాక్టికల్ ఎగ్జామ్స్ -  మార్చి 1 నుంచి 20 మధ్య

  • ఇంటర్‌ బోర్డు పరీక్షలు - వచ్చే ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 12

  • వేసవి సెలవులు -  ఏప్రిల్‌ 17 నుంచి మే 31వరకు

  • అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ -  మే, 2021 చివరి వారం 

  • వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం -  జూన్‌ 1, 2021     Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు


​ఫొటో గ్యాలరీస్:



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR