Ts Inter Results 2023: ఇంటర్మీడియట్ రిజల్ట్స్‌ను ఇలా SMS ద్వారా 1 నిమిషంలో చెక్ చేసుకోండి!
Ts Inter Results 2023: టీఎప్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అయితే మీరు కూడా ఈ ఫతాలను పొందడానికి ఇలా SMS పంపితే నేరుగా మీ మొబైల్‌కి ఫలితాలు వస్తాయి.
Manabadi Inter Results 2023: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. రెండు సంవత్సరాలకు సంబంధించిన రిజల్ట్స్ ఉదయం 11 గంటలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ పరీక్షలను మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులకు పైగా హాజరయ్యారు. పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాలను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ పేర్కొన్నారు. మీరు ఫలితాలను వెబ్‌సైట్‌లోనే కాకుండా SMS, ఇతర మార్గాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా సులభంగా ఇంటర్మీడియట్ ఫలితాలను తెలుసుకోవడానికి ఇది తప్పకుండా ఫాలో అవ్వండి.
ఫలితాలను ఇలా తెలుసుకోండి:
ఇంటర్మీడియట్ ఫలితాల కోసం:
ఇంటర్మీడియట్‌ల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా కాకుండా సులభంగా SMS ద్వారా కూడా పొందవచ్చు. అయితే ఈ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్టెప్ 1: ఫోన్‌లో SMS అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు TSGEN1 లేదా TSGEN2 అని టైప్ చేయండి.
స్టెప్ 3: దీన్ని 56263కి పైన తెలిపిర టెస్ట్స్‌ను పంపండి..
స్టెప్ 4: త్వరలో సులభంగా మీరు ఫలితాలు పొందుతారు.
Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాప్ రికార్డ్స్ ఇవే!
డిజిలాకర్ ద్వారా కూడా ఫలితాలు పొందొచ్చు:
స్టెప్ 1: డిజిలాకర్ వెబ్‌సైట్- digilocker.gov.inని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం మీరు డిజిలాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
స్టెప్ 2: ఈ యాప్‌లో మీ మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ అవ్వాలి.
స్టెప్ 3: మీ ఆధార్ కార్డ్ పేరు, పుట్టిన తేదీ, వర్గం, మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా, ఆరు అంకెల సెక్యూరిటీ పిన్‌ని ఆ యాప్‌లో ఫిల్ చేయాలి.
స్టెప్ 4: ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు స్టడీ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
స్టెప్ 5: ఈ స్టడీ అనే ఆప్షన్‌ను క్లిక్ చేస్తే TSBIE కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
స్టెప్ 6: అందులో ఇంటర్మీడియట్ ఫలితాల అనే కేటగిరీ కనిపిస్తుంది.
స్టెప్ 7:ఆ తర్వాత అందులో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే డైరెక్ట్‌గా ఫలితాలు పొందొచ్చు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాప్ రికార్డ్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.