Smita Sabharwal: సీఎంవో అధికారిని స్మితా సబర్వాల్ ఇంట్లోకి దూరిన డిప్యూటీ తహసీల్దార్
Smita Sabharwal House Incident: తెలంగాణ సీఎంవో అధికారి స్మితా సబర్వాల్ ఇంటికి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ వెళ్లడం కలకలం రేపుతోంది. ఆమె అప్రమత్తం కావడంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా..
Smita Sabharwal House Incident: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సంచలన ఘటన జరిగింది. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న సీఎంవో అధికారి, మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్థరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబడ్డారు. స్మితా సబర్వాల్ ఫిర్యాదు మేరకు డిప్యూటీ తహసీల్దారుతోపాటు ఆయన స్నేహితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా..
మేడ్చల్ డిప్యూటీ తహసీల్దార్‌గా ఆనంద్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ సోషల్ మీడియా ఖాతాను ఆయన ఫాలో అవుతుంటారు. ఆమె చేసే ట్వీట్లకు కామెంట్స్ చేయడం, రీ ట్వీట్ చేస్తూ ఉండేవారు. రెండు రోజుల క్రితం అర్థరాత్రి 11.30 గంటల సమయంలో తన ఫ్రెండ్ అయిన ఓ హోటల్ యజమానిని తీసుకుని కారులో నేరుగా స్మిత సబర్వాల్ నివాసం ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి తమ వివరాలు చెప్పడంతో.. వీళ్లను లోపల వెళ్లేందుకు అనుమతిచ్చారు.
గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్లిన డిప్యూటీ తహసీల్దార్.. తన స్నేహితుడిని కారులోనే ఉండమని చెప్పాడు. నేరుగా స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు. ఆమె వచ్చి తలుపు తెరవగా.. ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో ఆమె షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని మీరు ఎవరు..? ఎందుకు వచ్చారు..? అంటూ ప్రశ్నించారు. డిప్యూటీ తహసీల్దారు మాట్లాడుతూ.. తన గతంలో మీకు ట్వీట్ చేశానని.. ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసి ఆమె తక్షణం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ గట్టిగా కేకలు వేశారు. ఆమె కేకలు విన్న సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. అలాగే కారులో ఉన్న ఫ్రెండ్‌ను కూడా అరెస్ట్ చేసి.. కారును జప్తు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
సీఎంవో అధికారి స్మితా సబర్వాల్ ఇంటికి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ వెళ్లడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై స్మితా సబర్వాల్ కూడా స్పందించారు. తన నివాసంలో అత్యంత బాధాకరమైన ఘటన కలిగిందన్నారు. రాత్రి తన ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడని.. అప్రమత్తతతో తన ప్రాణాలను కాపాడుకున్నానని ట్వీట్ చేశారు. మీరు ఎంత సురక్షితంగా ఉన్నారో తెలుసుకోండి.. మీ ఇంటికి తాలాలు వేసుకోండి అని సూచించారు. అత్యవసర సమయాల్లో వంద నెంబరుకు డయల్ చేయాలని ఆమె సూచించారు.
స్మితా సబర్వాల్ నివాసంలో జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ పాలనలో మినిమమ్ గవర్నెన్స్ మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ ఫలితం ఇది అని ఆయన ట్వీట్ చేశారు. సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిబిడ్డకే కాదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే మహిళా ఉన్నతాధికారిణికీ భద్రత లేని పాలనలో ఉన్నామన్నారు. ఆడబిడ్డలూ.. తస్మాత్ జాగ్రత్త అంటూ రాసుకొచ్చారు.
Also Read: Rohit Sharma: గ్రౌండ్‌లోకి దూసుకువచ్చిన బాలుడు.. రోహిత్ శర్మ చెప్పిన ఆ ఒక్క మాటతో..
Also Read: India vs New Zealand: వరల్డ్‌కప్‌లో నేడు కీలక పోరు.. న్యూజిలాండ్‌తో టీమిండియా ఢీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి