Rajgopal Reddy: కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. కోమటిరెడ్డి రాజీనామాపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తుండగా.. అదే స్థాయిలో వాళ్లకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వ్యక్తిగత దూషణలకు దిగుతుండటంతో కాక రాజేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. కోమటిరెడ్డిని టీఆర్ఎస్ పార్టీలో రావాలని గతంలో సీఎం కేసీఆర్ ఆహ్వానించారని.. కేసీఆర్ దూతలుగా కొందరు టీఆర్ఎస్ నేతలు రాజగోపాల్ రెడ్డితో రహస్యంగా చర్చలు జరిపారని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన రాజీనామా ప్రకటన సందర్భంగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. ఉపఎన్నిక వస్తేనే నిధులు వస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి పార్టీ మారారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి.. తనకు ఆర్థిక లావాదేవీలే ముఖ్యం అయితే ఎప్పుడో అధికార టీఆర్ఎస్ పార్టలో చేరేవాడినని చెప్పారు. తనను టీఆర్ఎస్ చేరాలంటూ సీఎం కేసీఆర్ చాలా సార్లు ఆహ్వానించారని.. మంత్రి పదవి ఆఫర్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ ఇచ్చిన మంత్రిపదవి ఆఫర్ ను తిరస్కరించానని తెలిపారు. తాను ఆఫర్ ను తిరస్కరించాకే మరొకరికి ఆ పదలి దక్కిందని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. తనకు స్వార్దం ఉంటే అప్పుడే టీఆర్ఎస్ లో చేరి మంత్రిని అయ్యేవాడినని స్పష్టం చేశారు.


రాజగోపాల్ రెడ్డిని సీఎం కేసీఆర్ తన పార్టీలోకి ఆహ్వానించారన్న వార్తలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి చెప్పింది నిజమేనని.. అందుకు తానే ప్రత్యక్ష సాక్షి అన్నారు. టీఆర్ఎస్ లో చేరితే మంత్రిపదవి ఇస్తానని రాజగోపాల్ రెడ్డికి కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని తెలిపారు.తెలంగాణ ఉద్యమ సమయంలోనే రాజగోపాల్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించామని ఈటల రాజేందర్ వెల్లడించారు. 2014లో భువనగిరి ఎంపీగా ఓడిపోయినా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేశారన్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి తాము ఎంతగా ప్రయత్నించినా ఆయనే విజయం సాధించారని తెలిపారు. ఎమ్మెల్సీ అయ్యాకా మంత్రిపదవి ఆఫర్ చేసి పార్టీలోకి రావాలని కోరామన్నారు. అయినా రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టలేదన్నారు ఈటల రాజేందర్. గత ఎనిమిది ఏళ్లుగా రాజగోపాల్ రెడ్డిపై కక్ష కట్టి ఆర్థికంగా దెబ్బతీసేలా కేసీఆర్ సర్కార్ వ్యవహరించినా.. ఆయన మాత్రం లొంగిపోలేదన్నారు. అలాంటి రాజగోపాల్ రెడ్డిపై కాంట్రాక్ట్‌ల కోసం బీజేపీలో చేరుతున్నారని ఆరోపించడం దారుణమన్నారు. రాజగోపాల్ రెడ్డికి సీఎం కేసీఆర్ మంత్రిపదవి ఆఫర్ చేశారని.. అందుకే తానే సాక్షి అంటూ ఈటల రాజేందర్ చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.


Also Read: MUNUGODE BYELECTION LIVE UPDATES: చిల్లర దొంగ.. బ్లాక్ మెయిలర్! రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి ఫైర్




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook