Revanth Reddy Sorry: కోమటిరెడ్డికి క్షమాపణ.. మునుగోడు పాదయాత్రకు డుమ్మా! రేవంత్ రెడ్డికి హైకమాండ్ చివాట్లా?
Revanth Reddy Sorry: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా రేవంత్ రెడ్డికి గుర్తింపు. దూకుడు రాజకీయాలతోనే ఆయన వేగంగా ఎదిగారని చెబుతారు.దూకుడే తన అస్త్రంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి కొంత కాలంగా సైలెంట్ అయ్యారు. తన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
Revanth Reddy Sorry: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా రేవంత్ రెడ్డికి గుర్తింపు. దూకుడు రాజకీయాలతోనే ఆయన వేగంగా ఎదిగారని చెబుతారు. గతంలో టీడీపీలో.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆయన దూకుడుగానే రాజకీయాలు చేస్తున్నారు. పంచ్ డైలాగులే ఆయనకు ప్లస్ అంటారు. పీసీసీ చీఫ్ గా ఏడాది క్రితం నియమితులైన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వరుస కార్యక్రమాలతో కేడర్ లో జోష్ నింపారు. సీనియర్లు ఓ వైపు వ్యతిరేకిస్తున్నా ఎక్కడా వెనక్కి తగ్గలేదు రేవంత్ రెడ్డి. చేరికల విషయంలో సీనియర్ల నుంచి అభ్యంతరాలు వచ్చినా డోంట్ కేర్ అంటూ తన పని తాను చేసుకోపోయారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే రేవంత్ రెడ్డి దూకుడు పెంచారనే వార్తలు వచ్చాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ ఫుల్ సపోర్ట్ రేవంత్ రెడ్జికి ఉందనే టాక్ ఉంది.
దూకుడే తన అస్త్రంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి కొంత కాలంగా సైలెంట్ అయ్యారు. తన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ లో మొదట సైలెంట్ గా ఉన్నారు. తర్వాత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా మళ్లీ సైలెంట్ అయ్యారు. పీసీసీ చీఫ్ గా ఉన్నా తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పారు. గతంలోనూ కోమటిరెడ్డి విషయంలో క్షమాపణ చెప్పారు రేవంత్ రెడ్డి. శనివారం మరోసారి సారీ చెబుతూ వీడియో విడుదల చేశారు. అంతేకాదు మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర చేయాల్సి ఉండగా .. చివరి నిమిషంలో డుమ్మా కొట్టారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో సంస్థాన్ నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఆరోగ్య కారణాలతో పాదయాత్రకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దూరంగా ఉన్నారు. జ్వరంతో బాధపడుతుండడం, కరోనా లక్షణాలు ఉండటంతో క్వారెంటైన్ లో ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.
అయితే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ లో పెద్ద రచ్చ సాగుతోంది. స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తన పార్లమెంట్ పరిధిలోనే మునుగోడు ఉన్నా తనను సంప్రదించకుండానే పీసీసీ చీఫ్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండానే మునుగోడులో పాదయాత్ర ఎలా పెడతారని ప్రశ్నించారు. ఉప ఎన్నిక కమిటీ విషయం కూడా తనకు తెలియదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తాను మునుగోడులో ప్రచారం చేసే ప్రసక్తే లేదన్నారు. మునుగోడు నియోజకవర్గంలో వెంకట్ రెడ్డి పట్టుంది. దీంతో కోమటిరెడ్డి ఆరోపణలను హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఆరా తీసిందని సమాచారం. ఇక చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినిఉద్దేశించి అద్దంకి చేసిన కామెంట్లపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వచ్చింది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలోనే అద్దంకి దయాకర్ ఈ వ్యాఖ్యలు చేయడం హైకమాండ్ దృష్టికి వెళ్లిదంటున్నారు. ఈ విషయంలోనూ రేవంత్ రెడ్డిని పార్టీ పెద్దలు ప్రశ్నించారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఎంపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాఎందుకు నిలువరించలేదని రేవంత్ ను నిలదీశారని సమాచారం. అందుకే హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపమ చెప్పారని అంటున్నారు. ఇక మునుగోడులో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడంపైనా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి పాదయాత్రకు దూరంగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు మునుగోడు అభ్యర్థి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నెలకొంది. టికెట్ రేసులో ఉన్న పాల్వాయి స్రవంతి ఆడియా లీక్ కావడం కలకలం రేపింది. అందులో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా అభ్యర్థి విషయంలో స్పష్టత వచ్చేవరకు మునుగోడు వెళ్లవద్దని రేవంత్ రెడ్డికి పార్టీ పెద్దలు సూచించారని తెలుస్తోంది.
Read Also: Telangana Survey: రోజురోజుకు తగ్గుతున్న కేసీఆర్ గ్రాఫ్.. కారుకు బ్రేకులేనా? తాజా సర్వేలో సంచలనం..
Read Also: Munugode Byelection Live Updates: మునుగోడు పాదయాత్రకు రేవంత్ దూరం.. కేసీఆర్ తో కంచర్ల సోదరుల సమావేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu