Munugode Byelection Live Updates: మునుగోడు పాదయాత్రకు రేవంత్ దూరం.. కేసీఆర్ తో కంచర్ల సోదరుల సమావేశం

Munugode Byelection Updates: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, పోటాపోటీ వ్యూహాలతో మునుగోడులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది

Last Updated : Aug 13, 2022, 03:23 PM IST
Munugode Byelection Live Updates:  మునుగోడు పాదయాత్రకు రేవంత్ దూరం.. కేసీఆర్ తో కంచర్ల సోదరుల సమావేశం
Live Blog

Munugode Byelection Live Updates: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే పదివికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి 10 రోజులు కూడా కాకముందే మునుగోడు రాజకీయాలు పీక్ స్టేజీకి వెళ్లాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, పోటాపోటీ వ్యూహాలతో మునుగోడులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ఈనెల 20న మునుగోడులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. ఈనెల 21న చౌటుప్పల్ లో జరిగే బీజేపీ బహిరంగసభకు అమిత్ షా హాజరవుతున్నారు. ఈ సభలోనే కోమటిరెడ్డి కమలం గూటికి చేరనున్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ టికెట్ల లొల్లి ముదురుతోంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్ డేట్స్..

13 August, 2022

  • 15:22 PM

    మునుగోడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్- వెంకట్ రెడ్డి

    నాకు తెలియకుండానే మునుగోడు కమిటీ వేశారు- వెంకట్ రెడ్డి

    మునుగోడు ప్రచారానికి నేను వెళ్లను- వెంకట్ రెడ్డి

    రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పడం శుభ పరిణామం- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

    అద్దంకి దయాకర్ చిన్న పిల్లవాడు- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • 14:29 PM

    మునుగోడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి హోంగార్డ్ వ్యాఖ్యల కలకలం

    ట్విట్టర్ బయోలో తాను కాంగ్రెస్ పార్టీ హోంగార్డునని చెప్పిన వెంకట్ రెడ్డి

    గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో హోంగార్డుగా పని చేస్తున్నా- వెంకట్ రెడ్డి

     

  • 14:26 PM

    ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివాదంపై మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్పందించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో కోమటిరెడ్డి పాల్గొనాలని ఆయన  సూచించారు. మునుగోడు ఉపఎన్నిక కోమటిరెడ్డికి పిలవని పేరంటం కాదని.. ఆయన పార్టీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో ప్రచారం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు లేదని.. చెప్పారు.  పార్టీ నుంచి ఎవరిని సస్పెండ్ చేయాలన్న విషయం క్రమశిక్షణ కమిటి చూసుకుంటుందని దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు.

  • 14:17 PM

    రేవంత్ రెడ్డి క్షమాపణ విషయం తెలియదు- కోమటిరెడ్డి

    రేవంత్ రెడ్డి పాదయాత్ర లో పాల్గొనే ఆలోచన లేదు- కోమటిరెడ్డి

    నామీద ఘోరంగా మాట్లాడిన వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేశాక ఆలోచిస్తా- కోమటిరెడ్డి

    రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పడం సంతోషం - కోమటిరెడ్డి

    నాలాంటి ఉద్యమ కారుడిని గలీజ్ మాటలు అన్న వ్యక్తిని పార్టీలో కొనసాగిస్తే ప్రజలు హర్షించరు- కోమటిరెడ్డి

    అద్దంకిని పార్టీ నుండి పూర్తిగా బహిష్కరించిన తర్వాత ఆలోచిస్తా- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • 13:20 PM

    కంచర్ల సోదరులతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం

    మునుగోడులో అభ్యర్థి ఎవరైనా కలిసి పని చేయండి- కేసీఆర్

    ఈనెల 20 మునుగోడు సభలో అభ్యర్థిని ప్రకటిస్తా- కేసీఆర్

    మునుగోడు సభను విజయవంతం చేయండి- కేసీఆర్

  • 12:18 PM

    మునుగోడు టీఆర్ఎస్ లో చల్లారని టికెట్ల లొల్లి

    ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కంచర్ల సోదరుల సమావేశం

    మునుగోడు టికెట్ ఆశిస్తున్న కంచర్ల కృష్ణారెడ్డి

    నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి

  • 12:16 PM

    మునుగోడు పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరం

    కొవిడ్ లక్షణాలతో సెల్ఫ్ క్వారంటైన్ లో రేవంత్ రెడ్డి

  • 12:15 PM

    పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పినా వెనక్కి తగ్గని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్

    అద్దంకిని సస్పెండ్ చేసేవరకు పార్టీ కార్యక్రమాలకు హాజరు కాను- వెంకట్ రెడ్డి

Trending News