Telangana Survey: రోజురోజుకు తగ్గుతున్న కేసీఆర్ గ్రాఫ్.. కారుకు బ్రేకులేనా? తాజా సర్వేలో సంచలనం..

Telangana Survey: తెలంగాణలో హోరాహోరీ పోరు తప్పదా? టీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలు అడియాసలేనా? సీఎం కేసీఆర్ గ్రాఫ్ మరింత దిగజారిందా? అంటే వరుసగా వస్తున్న సర్వేలు అదే చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ పై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగిపోతుందని.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మరింతలా దిగజారిపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి.

Written by - Srisailam | Last Updated : Aug 13, 2022, 02:56 PM IST
  • తెలంగాణలో తగ్గిన కేసీఆర్ గ్రాఫ్
  • ఇండియా టుడే తాజా సర్వేలో సంచలనం
  • టీఆర్ఎస్ కు 8, బీజేపీకి 6 ఎంపీ సీట్లు
Telangana Survey: రోజురోజుకు తగ్గుతున్న కేసీఆర్ గ్రాఫ్.. కారుకు బ్రేకులేనా? తాజా సర్వేలో సంచలనం..

Telangana Survey: తెలంగాణలో హోరాహోరీ పోరు తప్పదా? టీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలు అడియాసలేనా? సీఎం కేసీఆర్ గ్రాఫ్ మరింత దిగజారిందా? అంటే వరుసగా వస్తున్న సర్వేలు అదే చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ పై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగిపోతుందని.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మరింతలా దిగజారిపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో తాజాగా నిర్వహించిన ఫలితాల్లో తెలంగాణకు సంబంధించి సంచలన ఫలితాలు వచ్చాయి.

తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత భారీగా ఉందని జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగానే తాజా సర్వేలో వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే  టీఆర్ఎస్ కు ఏకంగా 8 శాతం ఓట్లు తగ్గుతాయని ఇండియా టుడే సర్వేలో స్పష్టమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 41.7 శాతం ఓట్లు రాగా.. 9 సీట్లు గెలిచింది. బీజేపీ 19.7 శాతం ఓట్లు సాధించి నాలుగు లోక్ సభ సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 29.8 శాతం ఓట్లు సాధించినా.. ఆ పార్టీకి కేవలం మూడు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్ సీటు గెలిచిన ఎంఐఎంకి 2.8 శాతం ఓట్లు వచ్చాయి. తాజా ఇండియా టురే సర్వేలో టీఆర్ఎస్ కు 31 శాతం మాత్రమే ఓట్లు వస్తాయని తేలింది. లోక్ సభ సీట్ల విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో టీఆర్ఎస్ గతంలో కంటే ఒక సీటు కోల్పోయి 8 స్థానాలు గెలుచుకుందని సర్వేలో వెల్లడైంది.ఇక కమలం పార్టీకి గతంలో నాలుగు సీట్లు రాగా.. ఈసారి రెండు సీట్లు పెరిగి  6 స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి మూడు నుంచి రెండుకు పడిపోతుందని ఇండియా టుడే సర్వేలో స్పష్టమైంది. హైదరాబాద్ సీటును ఎంఐఎం నిలబెట్టుకోనుంది.

ముఖ్యమంత్రుల పనితీరులో కేసీఆర్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. టాప్ టెన్ జాబితాలో కేసీఆర్ కు స్థానం దక్కలేదు. ఇండియా టుడే నిర్వహించిన దేశంలో మోస్ట్​ పాపులారిటీ ముఖ్యమంత్రుల సర్వేలో ఈసారి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ టాప్ ప్లేస్ లో నిలిచారు. గత ఏడాది సర్వేలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ టాప్ లో నిలవగా.. ఈసారి ఆయన టాప్ టెన్ లో కూడా నిలవలేదు. 2020 జనవరిలో నిర్వహించిన సర్వేలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు టాప్ టెన్ జాబితాలో కనపించ లేదు. ఈ సారి కూడా కేసీఆర్ టాప్ టెన్ లో నిలవలేకపోయారు. గతంలో కంటే కేసీఆర్ గ్రాఫ్ మరింత తగ్గింది. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. గత ఏడాది సరేలో టాప్ ఫోర్ లో నిలిచిన ఏపీ సీఎం జగన్.. ఈసారి ఒక స్థానం కోల్పోయి ఐదో స్థానంలో నిలిచారు. మోస్ట్​ పాపులారిటీ సర్వేలో జగన్ కు 57 శాతం ఓట్లు వచ్చాయి. గత ఏడాది ఆయనకు 40 శాతం ఓట్లే వచ్చాయి. ఈసారి జగన్ కు 17 శాతం ఓట్లు పెరిగాయి.

ఇండియా టుడే నిర్వహించిన మూడ్​ ఆఫ్​ నేషన్​ సర్వేలో ప్రజలు మరోమారు ఎన్డీఏకు పట్టం కట్టనున్నారని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే286 సీట్లతో ఎన్డీఏ విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ కూటమికి 353 సీట్లు రాగా.. ఈసారి కొంత తగ్గుతాయని తేల్చింది. ఇక యూపీఏ కూటమికి గతసారి వందలోపే రాగా.. ఈసారి 146 స్థానాలు వస్తాయని సర్వేలో  తేలింది. ఓట్ల షేర్ చూస్తే  బీజేపీకి 41 శాతం, యూపీఏకు 28 శాతం, స్వతంత్రులకు 31 శాతం వస్తాయని సర్వేలో స్పష్టమైంది. ప్రధానిగా 53 శాతం ఓట్లతో మరోసారి నరేంద్ర మోడీ టాప్ లో నిలవగా.. రాహుల్ గాంధీకి 9 శాతం ఓట్లతో సెకెండ్ ప్లేస్ లో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ప్రధానిగా ఏడు శాతం మంది జై కొట్టారు.  

'ది మూడ్ ఆఫ్ నేషన్'పేరుతో  ఫిబ్రవరి ఆగస్టు మధ్య నిర్వహించిన సర్వేలో 1,22,016 మంది పాల్గొన్నారు. ఇండియా టుడే తాజా సర్వే  తెలంగాణలో ఆసక్తిగా మారింది. ఇండియా టుడే తాజా సర్వే ప్రకారం తెలంగాణలో హోరాహోరీ పోరు ఖాయమని తెలుస్తోంది. ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తికి తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ మాత్రం లోక్ సభ సీట్లు ఈ సర్వే జరిగిందని.. జాతీయ స్థాయి సర్వేలో బీజేపీకి కొంత ఫలితాలు అనుకూలంగా వస్తాయని.. అసెంబ్లీకి వచ్చే సరికి కారు పార్టీకి వార్ వన్ సైడే ఉంటుందని గులాబీ లీడర్లు చెబుతున్నారు. 

Also Read: VVS Laxman Coach: బీసీసీఐ మరో కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్సీ తర్వాత మరో మార్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News