ఆర్టీసీలో ఆ 12 వేల మందికి వీఆర్ఎస్ తప్పదా ?
టిఎస్ఆర్టీసీ(TSRTC)ని భవిష్యత్తులో ఎలా నిర్వహిస్తే శాశ్వతంగా సమస్యలు రాకుండా ఉంటాయనే విషయంలో రవాణా శాఖ అధికారులు, నిపుణులతో కలిసి సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారా అంటే అవుననే తెలుస్తోంది.
హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ(TSRTC)ని భవిష్యత్తులో ఎలా నిర్వహిస్తే శాశ్వతంగా సమస్యలు రాకుండా ఉంటాయనే విషయంలో రవాణా శాఖ అధికారులు, నిపుణులతో కలిసి సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారా అంటే అవుననే తెలుస్తోంది. ఇకపై బస్సుల సంఖ్య తగ్గిపోతే... అందుకు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను కూడా కుదించాల్సి ఉంటుంది కనుక అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలించాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశించారు. అందులో భాగంగానే 50 ఏళ్లకు పైబడిన సిబ్బందికి వీఆర్‌ఎస్(VRS) ఇచ్చి పంపిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. వీఆర్‌ఎస్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఏయే ప్రత్యేక పరిస్థితుల్లో సిబ్బందికి వీఆర్ఎస్ ఇవ్వొచ్చనే న్యాయపరమైన అంశాలను పరిశీలించడంతో పాటు.. వీఆర్ఎస్‌కు ఎంతమంది అర్హులవుతారు ? వారికి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కింద ఎంత మొత్తం ఖర్చు అవుతుంది అనే పూర్తి వివరాలతో కూడిన ఓ నివేదికను ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వార్తలొస్తున్నాయి.
Read also : కార్మికులకు ఆర్టీసీ ఎండి హెచ్చరిక!
అయితే, సీఎం కేసీఆర్ సూచన మేరకు అలా 50 ఏళ్లకు పైబడిన వారి గణాంకాలు వెలికి తీసిన అధికారులు.. అలాంటివారు సంస్థలో 12 వేల మందికి పైగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో మంగళవారం ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈనెల 28, 29 తేదీల్లో రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్న నేపథ్యంలో కేబినెట్ భేటీలోనూ ఆర్టీసీ సమ్మె(TSRTC Strike) అంశమే ప్రముఖంగా ప్రస్తావనకు రానున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ నాటికి సమగ్ర సమాచారం తెప్పించుకుని ఓ అవగాహనకు వచ్చేందుకే సీఎం కేసీఆర్ ఈ సమీక్షా సమావేశం జరిపినట్టు తెలుస్తోంది. దీంతో ఒకవేళ 50 ఏళ్లు పైబడిన సిబ్బందికి వీఆర్ఎస్ ప్రకటించే విషయంలో సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే.. ఇక 12 వైల మందికిపైగా ఉన్న ఆ సిబ్బందికి వీఆర్ఎస్ తప్పదా అనే ఆందోళన ఆర్టీసీ కార్మికుల్లో వ్యక్తమవుతోంది. Read also: విధుల్లో చేరతామని ప్రకటించిన కార్మికులు.. స్పందించిన ఆర్టీసీ ఎండి