టిఎస్ఆర్టీసీ ఉద్యోగులపై ఇటీవల పలు వరాలు గుప్పించిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తాజాగా వారికి క్రిస్మస్ పర్వదినం నాడే మరో గుడ్ న్యూస్ వినిపించారు. ఆర్టీసీ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇదివరకే దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ఉండగా తాజాగా బుధవారం నాడు సీఎం కేసీఆర్ అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగ పదవీ విరమణ వయస్సు పెంపు ప్రకటన ఇక అధికారికంగా అమలులోకి వచ్చినట్టయింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో బస్సులు నడిపి ప్రజా రవాణా సౌకర్యానికి సహకరించిన తమకు ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించాలని తాత్కాలిక సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనపై జేఏసీ కన్వినర్ అశ్వథామ రెడ్డి స్పందించారు. అశ్వత్థామ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
టిఎస్ఆర్టీసీ(TSRTC) సంస్థ ఏర్పడిన తర్వాత రెండోసారి బస్సు ఛార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్(Telangana govt) నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులను శుక్రవారం నుంచి విధుల్లో చేరాల్సిందిగా చెప్పిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం టిఎస్ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్టీసీ ఛార్జీలు(TSRTC fares) పెంచితే కానీ సంస్థ మనుగడ కష్టం అని తేల్చేశారు.
పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి-అడవి శ్రీరాంపూర్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.
టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC Strike) ఆగలేదని.. సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉందని టిఎస్ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి(Ashwathama Reddy) అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆర్టీసీ జేఏసీ(TSRTC JAC) నేతల సమావేశం జరిగింది.
తెలంగాణ సర్కార్ టిఎస్ఆర్టీసీ(TSRTC)ని నిర్వీర్యం చేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసినట్లుగానే ఆ తర్వాత సింగరేణి(Singareni)ని కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని లక్ష్మణ్ ఆరోపించారు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌తో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు భేటీ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను, సమ్మె అనంతరం జరుగుతున్న పరిణామాలు, కార్మికుల డిమాండ్లను కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీలు... కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా కృషిచేయాలని విజ్ఞప్తిచేశారు. ఆగస్ట్ 2019 గాను కార్మికులకు ఆర్టీసీ రూ. 80 కోట్ల బకాయిలు చెల్లించమని ఈపీఓ నుంచి డిమాండ్ నోటీస్ వచ్చిందని ఎంపీలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై ప్రభుత్వం విస్తృతస్థాయిలో చర్చ జరిపింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ ఈ విజ్ఞప్తి చేశారు.
టిఎస్ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టిఎస్ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వథ్థామ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పును గౌరవిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC strike) 47 రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ఓ లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.