IT raids on real estate companies:  హైదరాబాదులోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటి దాడులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ కార్పొరేట్ కార్యాలయాలపై గురువారం తెల్లవారుజామున నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ ఐటీ సోదాల్లో భాగంగా సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 అలాగే కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు ఆయా కంపెనీలకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్లు డైరెక్టర్ల నివాసాలపై కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి ముఖ్యంగా కొల్లూరు రాయదుర్గం జూబ్లీహిల్స్, సంగారెడ్డి లోని కార్యాలయాలపై కూడా ఐటీ సోదాలు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 30 టీములుగా ఏర్పడిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. 


అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ట్యాక్స్ ఎగవేత, లెక్కల్లో చూపని ఆదాయం, వంటి ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలు నిర్వహిస్తున్నంతసేపు సంస్థకు చెందిన అన్ని ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయా డైరెక్టర్లకు చెందిన నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టారు. గడచిన రెండు ఆర్థిక సంవత్సరాలుగా ఆయా కంపెనీల పైన ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 


Also Read: Supreme Court Next CJI: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎవరీయన


గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ అధినేత అక్బర్ షేక్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కావడం గమనార్హం. ఆయన గత ఎన్నికల్లో మలక్పేట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ దాడుల నేపథ్యంలో దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా..? అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాదులోని రియల్ ఎస్టేట్ కార్యాలయాల పైన ఐటీ దాడులు జరగడం కొత్తేమీ కాదు గతంలో కూడా ఈ తరహా దాడులు పలు కంపెనీల పైన జరిగాయి.


 లెక్కకు మించిన ఆదాయము, పన్ను ఎగవేత వంటి ఆరోపణల పైన ఈ దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడుల్లో పలుమార్లు పెద్ద మొత్తంలో నగదు తో పాటు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే నగరంలో హైడ్రా పేరిట రియల్ ఎస్టేట్ కంపెనీల గుండెల్లో బాంబులు పేలుతున్నాయి.


 మరోవైపు ఈ ఐడి దాడులు కూడా జరుగుతున్న నేపథ్యంలో , ఈ రంగానికి చెందిన పలు కంపెనీలు ఆందోళనకు గురవుతున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రస్తుతం ఇన్కమ్ టాక్స్ రాడార్ లో ఉన్న నేపథ్యంలో ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇకనుంచి పన్ను చెల్లింపు విషయంలో జాగ్రత్తగా ఉండాలని టాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు.


Also Read: NSG Commandos: చంద్రబాబు సహా 9 మంది నేతల భద్రత నుంచి వైదొలిగిన ఎన్‌ఎస్‌జీ కమాండోల జీతం ఎంతో తెలుసా? సీఆర్‌పీఎఫ్‌ శాలరీతో పోలిస్తే...  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.