తెలంగాణలో రెండవ ఐటీ‌ హబ్ రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్ తో పాటు  తెలంగాణ ఇతరప్రాంతాల్లో సైతం ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఐటీ రంగంలో తెలంగాణ ప్రస్తుతం రెండో స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌ను ఆయన ప్రారంభించారు. 34 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ టవర్లోని పలు కంపెనీల్లో ఎంపికైన ఉద్యోగులకు నియామక పత్రాల్ని అందించారు కేటీఆర్


తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఐటీ అభివృద్ధిపై పలు సందేహాలు తలెత్తాయని కానీ ఇప్పుడు లక్షా 28 వేల కోట్లకు చేరుకుందని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ లో టాస్క్, టీ హబ్  కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నామని...ఎప్పటికప్పుడు కొత్త విధానాల్ని అనుసరిస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరింపజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  అందులో భాగంగానే కరీంనగర్ వంటి నగరాల్లో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గ్రామీణ యువత ఐటీలో సత్తా చూపుతోందని కేటీఆర్ గుర్తు చేశారు. స్థానిక స్టార్టప్‌లను ఎక్కడికక్కడ ప్రోత్సహించాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. Also read: Telangana: కొత్త సెక్రటేరియన్ డిజైన్ పై నేడు నిర్ణయం