తెలుగు రాష్ట్రాల్లో భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన ఐటీ శాఖ
తెలుగు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంతాల్లో లెక్కలు చూపని రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పుణేల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు చేసిన చేసినట్టు తెలిపారు. సోదాల్లో బోగస్ సబ్ కాంట్రాక్టులు, ఓవర్ ఇన్వాయిసింగ్, బోగస్ బిల్లులు ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంతాల్లో లెక్కలు చూపని రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పుణేల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు చేసిన చేసినట్టు తెలిపారు. సోదాల్లో బోగస్ సబ్ కాంట్రాక్టులు, ఓవర్ ఇన్వాయిసింగ్, బోగస్ బిల్లులు ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఇందులో ఓ కీలక నేత మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్ నివాసంలో కీలక పత్రాలు, వాట్సప్ మెసేజ్‌లు, ఈమెయిల్స్, లెక్కచూపని విదేశీ లావాదేవీలను గుర్తించినట్టు తెలిపారు.
ట్యాక్స్ ఆడిట్‌ను తప్పించుకోవడానికి రూ.2 కోట్లకన్నా తక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలను సృష్టించారని, షెల్ కంపెనీలకు అసలు ఓనర్లు ప్రధాన కాంట్రాక్టర్లేనని ఐటీ అధికారులు పేర్కొన్నారు. అసలు కంపెనీలు, షెల్ కంపెనీల ఐటీ రిటర్నులను ఒకే ఐపీ అడ్రస్‌తో ఫైల్ చేసారని ప్రాథమిక దర్యాప్తులోనే రూ.2వేల కోట్లకు పైగా అక్రమాలు బయటపడ్డాయని తెలిపారు. అంతేకాకుండా లెక్కచూపని రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల విలువైన ఆభరణాలను, 25 బ్యాంక్ లాకర్లను సీజ్ చేసినట్టు ఐటీ అధికారులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..