Jagga Reddy News: పార్టీ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. హైదరాబాద్​లో వివిధ పార్టీల సమావేశాలు (Congress party on TS Govt) జరుగుతున్నాయని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఆర్ఎస్​ పార్టీకి సంబంధించిన ఓ సమావేశం కూడా శుక్రవారమే ముగిసినట్లు గుర్తు చేస్తూ.. కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్​ సోషల్​ మీడియాలో  (Manickam Tagore on Telangana Govt) తీవ్ర విమర్శలు చేశారు.


తాము 120 మందితో శిక్షణ శిబిరాలు పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. 300 మందితో బీజేపీ ఏర్పాటు చేసుకున్న సంఘ్​ శిక్షణనకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు.


ఇదే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ప్రభుత్వంపై (MLA Jagga Reddy on Govt) విమర్శలు గుప్పించారు. బీజేపీకి లేని కొవిడ్ రూల్స్.. కాంగ్రెస్​కు మాత్రమే వర్తిస్తాయా? అంటూ (Jagga reddy on Covid rules) ప్రశ్నించారు.


ఈ అంశంపై డీజీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు జగ్గా రెడ్డి. రాష్ట్రంలో ద్వంద్వ విధానం నడుస్తోందంటూ విమర్శలు చేశారు.


కేంద్రంలో, రాష్ట్రంలో పవర్​లో లేదని.. కాంగ్రెస్​కు పర్మీషన్ ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్​ఎస్ కార్యక్రమాల్లో ఎవరూ కొవిడ్ నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. ఈ విషయంపై డీజీపీ వెంటనే స్పందించాలని డిమాండ్​ చేశారు.


Also read: Breaking News: టీఆర్​ఎస్​ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్- సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిర్ణయం!


Also read: Vanama Raghava: వనమా రాఘవ అరాచకాల చిట్టా.. ఇప్పటివరకూ ఎన్ని నేరాలకు పాల్పడ్డాడంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook