Jagga Reddy vs Minister Harish Rao: హైదరాబాద్:  కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి మంత్రి హరీశ్ రావుని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. సింగూరు, మంజీరా డ్యామ్‌లు నింపే వరకు నీళ్ల కోసం నా పోరాటం ఆగదని స్పష్టంచేసిన ఆయన.. అవసరమైతే ఈ విషయంలో మంత్రి హరీశ్ రావును నిలదీయడానికైనా తాను సిద్ధమేనని అన్నారు. జిల్లాలోని స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై త్వరలోనే జరగనున్న సమావేశంలో పాల్గొని మంత్రి హరీష్ రావును నిలదీస్తానని తేల్చిచెప్పారు. ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ నాయకులు తన మీద దాడి చేయాలని ప్రయత్నిస్తే.. ప్రతిదాడి చేయడానికైనా తాను సిద్ధంగానే ఉన్నానని జగ్గారెడ్డి ( Jagga Reddy) హెచ్చరించారు. అందుకోసం అవసరమైతే తన బలగం, కుటుంబంతో మంత్రి సమావేశానికి వెళ్తానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రులకు, టీఆర్‌ఎస్‌ నేతలకు పోలీసుల బలం ఉంటే.. తనకు కార్యకర్తల బలం ఉందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తాను దేనికి వెనకాడబోనని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చేస్తే మన మనుగడుకే ముప్పు: హరీష్ రావు )


నీళ్ల విడుదల విషయంలో తమ ఎంపీతో ఏ ప్రయోజనం లేదని.. ఆయన ఒక్కసారి కూడా నీళ్ల కోసం నోరు తెరిచి అడగలేదని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా డమ్మీగానే మిగిలిపోయారని జగ్గారెడ్డి టీఆర్ఎస్ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..