Jagtial woman gets heart attack while travelling: ముంబైలో (Mumbai) కూలీగా పనిచేస్తున్న ఓ తెలంగాణ మహిళ బస్సులో స్వగ్రామానికి వస్తుండగా గుండెపోటుతో మృతి చెందింది. బస్సులో ప్రయాణిస్తుండగా పుణే సమీపంలో ఆమె గుండెపోటుకు గురైంది. ఆసుపత్రికి తరలించినప్పటికీ.. కాసేపటికే ఆమె మృతి చెందింది. ట్రావెల్ యాజమాన్యం సహకారంతో మృతురాలి శవాన్ని ఆమె కుమార్తె స్వగ్రామానికి చేర్చగలిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల (Jagtial) జిల్లా పూడూరుకు చెందిన పెద్ది కేతవ్వ (40) చాలా కాలంగా ముంబైలో కూలీగా పనిచేస్తోంది. బుధవారం (జనవరి 26) తన కూతురు కల్యాణితో కలిసి బస్సులో ముంబై నుంచి జగిత్యాలకు బయలుదేరింది. మార్గమధ్యలో పుణే సమీపంలోని పాటస్ ప్రాంతంలో ఆమె గుండెపోటుకు గురైంది. వెంటనే ఆమె కూతురు బస్సు సిబ్బందిని అలర్ట్ చేయడంతో.. కేతవ్వను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించండంతో కాసేపటికే కేతవ్వ మృతి చెందింది.


పోస్టుమార్టమ్ అనంతరం కేతవ్వ మృతదేహాన్ని (Dead Body) కూతురు కల్యాణికి అప్పగించారు. ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు యాజమాన్యం సహకారంతో కల్యాణి తన తల్లి మృతదేహాన్ని జగిత్యాలలోని (Jagtial) స్వగ్రామం పూడూరుకు చేర్చగలిగింది. మానవత్వంతో వ్యవహరించిన ఆ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యానికి కేతవ్వ కూతురు కల్యాణి సహా కుటుంబ సభ్యులు, బంధువులు కృతజ్ఞతలు తెలియజేశారు. కేతవ్వ మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 


Also Read: Viral video: చావు నుంచి రెప్పపాటులో తప్పించుకున్న బైకర్​​- షాకింగ్ వీడియో!


Also read: Minnal Murali Wedding Shoot: 'మిన్నాళ్ మురళి' స్టైల్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్..వైరల్ అవుతున్న వీడియో..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook