Minnal Murali Wedding Shoot: 'మిన్నాళ్ మురళి' స్టైల్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్..వైరల్ అవుతున్న వీడియో..

Minnal Murali Wedding Shoot: మిన్నాళ్ మురళీ క్యారెక్టర్‌ను అమితంగా ఇష్టపడిన ఓ వ్యక్తి తన ప్రీ వెడ్డింగ్ షూట్ ను ఆ పాత్ర తరహాలో షూట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 12:36 PM IST
  • సినిమా స్టైల్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్
  • కేరళలో కొత్త జంట వినూత్న ప్రయత్నం
 Minnal Murali Wedding Shoot: 'మిన్నాళ్ మురళి' స్టైల్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్..వైరల్ అవుతున్న వీడియో..

Minnal Murali Wedding Shoot: ఈమధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ వినూత్నంగా షూట్ చేస్తున్నారు. ఖర్చు కోసం వెనుకాడట్లేదు. తమ క్రియేటివిటీకి పదును పెడుతూ... సినిమా స్టైల్లో వెడ్డింగ్ షూట్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఓ కొత్త కపుల్ మలయాళ మూవీలోని సీన్ తరహాలో షూట్ నిర్వహించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.

ఇటీవల మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం 'మిన్నాళ్ మురళి' (Minnal Murali). మలయాళంలో మాత్రమే కాదు.. ఈ సినిమా ప్రతీ భాషలో చూసిన వారి దగ్గర నుండి ప్రశంసలు అందుకుంటోంది. సింపుల్‌గా చెప్పాలంటే మిన్నాళ్ మురళి.. ఇండియన్ సూపర్ మ్యాన్. దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ చిత్రం బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: Methuselah: ఈ చేప వయసు 90 ఏళ్లు.. భూమిపై ఎక్కువ వయసున్న చేప ఇదే!

ఆ మిన్నాళ్ మురళీ క్యారెక్టర్‌ను అమితంగా ఇష్టపడిన ఓ వ్యక్తి తన ఫ్రీ వెడ్డింగ్ వీడియోలో (Minnal Murali Wedding Shoot) తానే మిన్నాళ్ మురళిగా రెడీ అయ్యాడు. తనకు కాబోయే భార్యను పెళ్లి చేసుకున్నాడు. కేరళలోని (Kerala) కొట్టాయం జిల్లాలో ఈ వీడియో చిత్రీకరించారు. ఈ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియోలో హాల్ చల్ చేస్తోంది. ఈ వీడియోకు నెటిజన్స్  తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News