Telangana Politics: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌, బీజేపీ రాజకీయాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ పరిణామం. అయితే ఇదే రోజు తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీకి ఊహించని షాక్‌ తగిలింది. బీజేపీకి చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనే జితేందర్‌ రెడ్డి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌లో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్‌పై కూడా కేసు నమోదు


 


ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన జితేందర్‌ రెడ్డి గతంలో బీఆర్‌ఎస్‌ ఎంపీగా పని చేశారు. అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో బీజేపీలో కొన్ని సంవత్సరాలు కొనసాగారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ టికెట్‌ ఆశించగా బీజేపీ డీకే అరుణకు కేటాయించింది. ఈ నేపథ్యంలో పార్టీపై అసంతృప్తితో ఉన్న జితేందర్‌ రెడ్డిని స్వయంగా రేవంత్‌ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

Also Read: KTR: ప్రియమైన చెల్లెలు కవిత అరెస్ట్‌పై కేటీఆర్‌ సంచలన ట్వీట్‌.. ఏమన్నారంటే?


అతడి ఆహ్వానాన్ని మన్నించి జితేందర్‌ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ దీపామున్షీ, రేవంత్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అంతకుముందు బీజేపీకి రాజీనామా చేశారు. అతడితోపాటు కుమారుడు మిథున్‌ రెడ్డి కూడా చేరాడు. అయితే కాంగ్రెస్‌లో చేరినా కూడా జితేందర్‌ రెడ్డికి టికెట్‌ లభించకపోవడం గమనార్హం. ఎందుకంటే మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి చల్లా వంశీచంద్‌ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఇప్పటికే పార్టీ టికెట్‌ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అలా పార్టీలో చేరారో లేదో ఇలా జితేందర్‌ రెడ్డికి పదవి ఇచ్చారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తెలంగాణ ప్రభుత్వం జితేందర్‌ రెడ్డిని నియమించింది.


బీజేపీకి ఊహించని షాక్‌..
మహబూబ్‌నగర్‌కు చెందిన కీలక నాయకుడిగా ఉన్న జితేందర్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం బీజేపీకి ఒక ఎదురుదెబ్బగా భావించవచ్చు. దీనికితోడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలోనే ఆయన బీజేపీకి రాజీనామా చేయడం గమనార్హం. జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ నుంచి రెండు సార్లు ఎంపీగా పని చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జితేందర్‌ రెడ్డి తనయుడు మిథున్‌ బీజేపీ తరఫున మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter