Jubileehills Car Accident: హైదరాబాద్ జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. ప్రమాదానికి కారణమైన కారులో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కూడా ఉన్నట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. రాహిల్‌ అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు అఫ్నాన్, నాజ్.. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. నిందితులు పారిపోయిన రూట్‌లో సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించామన్నారు. ప్రమాద సమయంలో కారు డ్రైవ్ చేసింది అఫ్నాన్ అని పోలీసులు తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదానికి గురైన కారు‌కు ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ అంటించి ఉండటంతో... అది ఎమ్మెల్యే కారే అన్న ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన షకీల్... అది తన బంధువుల కారు అని, బాధితులను ఆదుకోవాల్సిందిగా వారితో చెప్పానని అన్నారు. ప్రమాదానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని.. తాను దుబాయిలో ఉన్నానని చెప్పారు. కాగా, కారులో తమ బంధువులు మాత్రమే ఉన్నారని షకీల్ చెప్పగా.. అందులో ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నారని పోలీసులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.


ప్రమాదం ఎలా జరిగింది :


గురువారం (మార్చి 17) రాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 వైపు వేగంగా దూసుకొచ్చిన మహేంద్ర థార్ కారు.. ఆ సమయంలో రోడ్డు దాటుతున్న కాజల్‌ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మా బోస్లేలను ఢీకొట్టింది. దీంతో కాజల్ చౌహాన్ చేతిలో ఉన్న రెండు నెలల పసికందు చేతి నుంచి జారిపోయి కిందపడిపోయింది. దీంతో తీవ్ర గాయాలైన చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కాజల్‌ చౌహాన్‌ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రమాద ఘటనపై కేసు నమోదైంది. ప్రమాదానికి గురైన కారుపై ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ అంటించి ఉండటంతో యాక్సిడెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే అది తన బంధువుల కారు అని.. అప్పుడప్పుడు తాను వాడుతుంటానని.. అందుకే స్టిక్కర్ అంటించి ఉందని షకీల్ చెప్పారు. ప్రమాదంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 


Also Read:  RRR Movie Tickets: గ్యాస్ సిలిండర్ తీసుకుంటే.. ఉచితంగా ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్లు! ఎక్కడో తెలుసా?!!


Also read : RRR: 'ఆర్ఆర్ఆర్'కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్ల పెంపునకు అనుమతి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook