Gachibowli Road Accident: గచ్చిబౌలిలో కారు బోల్తా... ముగ్గురు మృతి..

Road Accident in Gachibowli: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఓ మహిళను ఢీకొట్టి బోల్తా పడింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 08:50 PM IST
  • హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం
  • అదుపు తప్పి బోల్తా కొట్టిన కారు
  • ప్రమాదంలో ముగ్గురు మృతి
Gachibowli Road Accident: గచ్చిబౌలిలో కారు బోల్తా... ముగ్గురు మృతి..

Road Accident in Gachibowli: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఓ మహిళను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం (మార్చి 18) సాయంత్రం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ మార్గంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. ఆ సమయంలో రోడ్డు మధ్యలో ఉన్న చెట్లకు మహేశ్వరమ్మ (38) అనే మహిళ నీళ్లు పడుతోంది. రయ్యిమని దూసుకొచ్చిన కారు మహేశ్వరమ్మను బలంగా ఢీకొట్టి.. కాస్త ముందుకెళ్లి బోల్తా పడింది. 

ఈ ప్రమాదంలో మహేశ్వరమ్మ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న రోహిత్, గాయత్రిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇద్దరినీ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.

గురువారం (మార్చి 17) జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. ముగ్గురు మహిళలు రోడ్డు దాటుతుండగా కారు వారిని ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన కారు ఎమ్మెల్యే షకీల్‌దే అన్న ఆరోపణలు వినిపించాయి. ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే షకీల్.. ఆ కారు తన కజిన్‌ది అని పేర్కొన్నారు. అప్పుడప్పుడు తాను కూడా ఆ కారును వాడుతానని.. అందుకే దానికి తన స్టిక్కర్ అంటించారని చెప్పారు. చనిపోయిన చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని తన కజిన్‌ని కోరినట్లు తెలిపారు. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read: World Sleep Day: నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం.. ఏఐజీ సర్వేలో ఆసక్తికర విషయాలు...

Also read: Omar Abdullah: ది కశ్మీర్​ ఫైల్స్ మూవీపై ఒమర్ అబ్దుల్లా ఫైర్​- తప్పులు చూయించారంటూ..

స్తానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News