Junior Artist Jyothi Reddy Death: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి మృతిపై ఆమె కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పోలీసులు చెప్పిన కథనాన్ని ఆమె తండ్రి పవుల్ రెడ్డి వ్యతిరేకించారు. తమ కూతురి మృతిపై అనుమానాలు ఉన్నాయని... పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సంక్రాంతి (Sankranti 2022) పండగ నిమిత్తం జ్యోతి ఇంటికి వచ్చింది. మూడు రోజులు కడపలో ఉండి నిన్ననే హైదరాబాద్‌కు బయలుదేరింది. సాయంత్రం సమయంలో జ్యోతి మృతి చెందినట్లు ఆమె స్నేహితులు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. షాద్ నగర్ రైల్వేస్టేషన్‌లో.. కదులుతున్న రైలు ఎక్కుతుండగా కింద పడి మృతి చెందిందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. నా కూతురు జ్యోతి జూనియర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో చేసింది. ఇటీవలే 'పుష్ప' సినిమాలో డ్యాన్స్ కూడా చేసింది. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు జాగ్రత్త అని తనతో చెప్పాను. ఇంతలోనే చావు వార్త వినాల్సి వచ్చింది.' అంటూ జ్యోతి తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు.


కాచిగూడ రైల్వే స్టేషన్ (Kacheguda Railway Station) అనుకుని.. షాద్ నగర్‌లో తన కూతురు రైలు దిగినట్లు పోలీసులు చెప్పారని పవుల్ రెడ్డి తెలిపారు. అది కాచిగూడ కాదని తెలిసి మళ్లీ రైల్లోకి ఎక్కే ప్రయత్నం చేసిందని.. ఈ క్రమంలో కిందపడి గాయాలపాలైందని చెప్పినట్లు పేర్కొన్నారు. జ్యోతి నిజంగానే కింద పడిపోయిందా.. లేక ఎవరైనా రైల్లో నుంచి తోసేశారా అన్నది తెలియాలన్నారు. జ్యోతి మృతిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు బయటపెట్టాలన్నారు. 


ఉస్మానియా ఆసుపత్రిలో జ్యోతిరెడ్డి (Junior Artist Jyothireddy) మృతదేహానికి పోస్టుమార్టమ్ సందర్భంగా జూనియర్ ఆర్టిసులు ఆందోళనకు దిగారు. జ్యోతిరెడ్డి షాద్ నగర్ రైల్వే స్టేషన్‌లో (Indian Railway) గాయాలపాలైతే... ఆ సీసీటీవీ ఫుటేజీ ఎందుకు బయటపెట్టట్లేదని ప్రశ్నిస్తున్నారు. అసలు రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేవని పోలీసులు చెబుతున్నారని పేర్కొన్నారు. జ్యోతిరెడ్డికి అసలేం జరిగిందో తెలియాలని.. ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.


Also Read: Junior Artist Death: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి మృతి... అసలేం జరిగిందంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook