KCR Doing A Mistake: పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో మాజీ సీఎం కేసీఆర్  కొత్త నాటకానికి తెర తీశారని మంత్రి జూప‌ల్లి కృష్ఱా రావు ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధి కోసమే కేసీఆర్‌ ప్రయత్నాలు అని చెప్పారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భ‌వన్‌లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. సీడ‌బ్ల్యూసీ స‌భ్యుడు వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, అనిరుధ్ రెడ్డి త‌దిత‌రులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణా జలాల అంశంపై వివరణ ఇచ్చారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, ప్రాజెక్టుల వివరాల వాటిపై సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలను తిప్పి కొట్టారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sharmila Letter: జగనన్న, బాబుకు షర్మిల పిలుపు.. కేంద్రంపై రండి కొట్లాడుదామని ఆహ్వానం


'అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌ను తిర‌స్క‌రించారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీకి ఒక్క ఎంపీ స్థానం గెలుచుకోదు. ఆ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు మా పార్టీలో చేరుతున్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ప‌రువు కాపాడుకోవడానికి కృష్ణా జలాల పేరు చెప్పి కొత్త రాజ‌కీయ డ్రామాకు తెర‌లేపారు' అని మంత్రి జూపల్లి తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల అకాంక్ష‌ల‌కు భిన్నంగా ప‌రిపాల‌న చేశారని మండిపడ్డారు. నీళ్ల విష‌యంలో తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్, కేంద్ర ప్ర‌భుత్వంపై కేసీఆర్‌ ఒత్తిడి తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయం చేస్తున్న బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్‌ చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరిగిందని విమర్శించారు. నీటి వాటాల్లో తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంటే కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాల్సింది పోయి మోకారిల్లిందని చెప్పారు.

Also Read: TSPSC Chairman: నాది క్లీన్‌ రికార్డు.. నా ప్రతిష్ట దిగజార్చేందుకు తప్పుడు ప్రచారం


ప‌దేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్ర‌భుత్వం  కేవ‌లం 299 టీఎంసీల‌ నీటి వాటాను వాడుకోవ‌డానికి  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని జూపల్లి కృష్ణారావు గుర్తుచేశారు. తెలంగాణ వ‌చ్చాక  స‌గ‌టున 85 టీఎంసీల‌ను మాత్ర‌మే వాడుకుని తీవ్ర అన్యాయం చేశారని వివరించారు. కృష్ణా న‌దీ జ‌లాల‌ను ఇత‌ర బేసిన్‌ల‌కు త‌ర‌లించుకుపోతుంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రించిందని ఆరోపించారు. ఏపీకి హ‌క్కులు క‌ల్పించి రాష్ట్రానికి, ప్ర‌త్యేకంగా ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, న‌ల్గొండ, ఖ‌మ్మం  జిల్లాల‌కు  తీర‌ని అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మేనని విమర్శించారు. పదేళ్ల కాల‌యాప‌న చేసింది బీఆర్ఎస్  ప్ర‌భుత్వ‌మేనని మండిపడ్డారు. 


తెలంగాణ  ప్రాజెక్ట్‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వ స‌ర్వాధికారాలు క‌ట్ట‌బెట్టినప్పుడు నోరు మెద‌ప‌కుండా కూర్చుంది మీరే క‌దా అని బీఆర్‌ఎస్‌ పార్టీని జూపల్లి కృష్ణారావు నిలదీశారు. మీరు ఏదైతే ధ‌ర్నా, పోరాటం చేస్తామ‌ని చెప్పుతున్నారో ఆ పోరాట‌ం కేంద్ర ప్ర‌భుత్వంపై అప్పుడే చేస్తే ఇవాళ ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాదని పేర్కొన్నారు. అధికారం కొల్పోయిన త‌ర్వాత తెలంగాణ ప్ర‌జ‌ల ఉద్వేగాలు, మ‌నోభావాలను రెచ్చ‌గొట్టి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే కొత్త‌గా కేఆర్ఎంబీ అంశాన్ని తెర‌పైకి  తెచ్చారని చెప్పారు. తమ ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తుందని స్పష్టం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook