Telangana High Court: తొలి మహిళా సీజేగా హిమా కోహ్లీ ప్రమాణం
Justice Hima Kohli Sworn As CJ Of Telangana High Court: తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీజే హిమా కోహ్లీతో గురువారం ప్రమాణం చేయించారు.
Justice Hima Kohli, CJ Of Telangana High Court: తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీజే హిమా కోహ్లీతో గురువారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
కాగా, గత గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ(Telangana) రాష్ట్రాలకు నూతన సీజేలను నియమించడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేటి ఉదయం 10 గంటలకు ఏకే గోస్వామి చేత ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు.
Also Read: స్మోకింగ్ చేస్తున్నారా.. ఇకనుంచి వారికి నిషేధం, కొత్త రూల్స్ ఇవే!
Also Read: విష ప్రయోగం చేశారంటూ ISRO Scientist Tapan Misra సంచలన ఆరోపణలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook