K Kavitha: కల్వకుంట్ల కవిత సంచలనం.. రేవంత్ రెడ్డిని ధిక్కరించి తెలంగాణ తల్లికి శంకుస్థాపన
K Kavitha Breaks The Telangana Thalli Gazette: రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ధిక్కరించారు. కాంగ్రెస్ తల్లిని కాదని తెలంగాణ తల్లి ఆవిష్కరించుకుంటామని చెప్పి జగిత్యాల గడ్డపై కవిత యుద్ధం ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Telangana Thalli Statue: కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి గెజిట్ జారీ చేసిన రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారీ షాక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గడ్డపార పట్టుకుని పాత తెలంగాణ తల్లి విగ్రహా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బరాబర్ కాంగ్రెస్ మాత కాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా కాంగ్రెస్ తల్లిలో బతుకమ్మను మాయం చేయడంపై నిరసనగా మహిళలతో బతుకమ్మ ఆడిపాడారు. అంతేకాకుండా పార్టీ మారిన స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా కవిత బలప్రదర్శన చేశారు.
Also Read: Danam Nagender: రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే దానం నాగేందర్ షాక్.. అల్లు అర్జున్ అరెస్ట్ ఖండన
జైలుకు వెళ్లిన వచ్చిన అనంతరం తొలిసారి కవిత జగిత్యాల పర్యటన చేపట్టారు. ఆదివారం ధరూర్ బైపాస్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ సంఖ్యలో ప్రజలు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. గజమాలతో స్వాగతం పలికిన అనంతరం స్థానికంగా అంబేడ్కర్ విగ్రహానికి కవిత నివాళులర్పించారు. అనంతరం మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు.
Also Read: K Kavitha: ఎమ్మెల్సీ కె కవిత సంచలనం.. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లికి 'కాంగ్రెస్ మాత'గా నామకరణం
కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ మాతగా ప్రకటించిన కవిత దానికి నిరసనగా ప్రభుత్వ జీవోను ధిక్కరించి 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత ఈ సందర్భంగా మాట్లాడారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదు' అని స్పష్టం చేశారు. ఉద్యమ తెలంగాణ తల్లినే గ్రామ గ్రామాన ప్రతిష్టించుకుంటామని ప్రకటించారు. 'గెజిట్ ఇచ్చినా.. కేసులు పెట్టినా భయపడేది లేదు' అని పేర్కొన్నారు.
'మా అందరికీ ధైర్యాన్ని.. స్ఫూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లినే ఆరాధిస్తాం. తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటాం. తెలంగాణ అస్తిత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన ఎండగడుతాం' అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter