KK Resign: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, పార్టీ జనరల్‌ సెక్రటరీ కే కేశవ రావు పార్టీని వీడనున్నారని తెలుస్తోంది. తన కుమార్తె, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి రాజకీయ భవిష్యత్‌ కోసం కేకే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ స్వయంగా ఇంటికి వచ్చి కేకేను పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR Challenge: దమ్ముంటే రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయాలి: కేటీఆర్‌ సంచలన సవాల్‌

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకే బీఆర్‌ఎస్‌ పార్టీ మేయర్‌గా ఉన్న విజయలక్ష్మి కలిసింది. ఆ సమయంలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇక పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. కూతురుతోపాటు తండ్రిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ రాయబారాలు నడిపింది. ఈ నేపథ్యంలో కేకేతోపాటు విజయలక్ష్మి హస్తం కండువా కప్పుకోనున్నారు. అయితే కుమార్తె కోసం తాను పార్టీ మారుతున్నట్లు చెప్పేందుకు కేకే స్వయంగా కేసీఆర్‌ను కలిశారు. నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి చేరుకుని ఏకాంతంగా చర్చించారు. 

Also Read: Telangana Drought: యాత్రలు.. జాతరలు తప్పితే రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదు: కేటీఆర్‌


 


'వెళ్లి వస్తా' అని చెప్పేందుకు కేకే కేసీఆర్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు. 'లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌, బీజేపీకే అత్యధిక సీట్లు వస్తాయి. బీఆర్‌ఎస్‌ మూడో స్థానంలో ఉంటుంది' అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యల అర్థం ఆయన పార్టీ మారబోతున్నారని స్పష్టమైంది.


ఉమ్మడి రాష్ట్రంలో కే కేశవ రావు సీనియర్‌ నాయకుడిగా ఉన్నారు. ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్‌ పార్టీ నుంచే మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. 2006 నుంచి వరుసగా నేటి వరకు రాజ్యసభ సభ్యుడిగా కేకే కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్‌ కేకేను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. గులాబీ కండువా కప్పుకున్న అనంతరం రాజకీయ వ్యవహారాల్లో కేకేతో కలిసి కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2018లో ప్రభుత్వం రద్దు, అభ్యర్థుల ఎంపిక వంటి వాటితోపాటు ప్రభుత్వ వ్యవహారాల్లో కేసీఆర్‌కు సలహాదారుగా కేకే వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. ఆయనకు పార్టీలో అత్యున్నత పదవి కట్టబెట్టారు. ఆయన కూతురు విజయలక్ష్మికి హైదరాబాద్‌ మేయర్‌ పదవి ఇచ్చారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో కేకే కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి