Gautam Adani: అదానికో న్యాయం.. ఆడదానికి మరో న్యాయమా..?.. ఎక్స్ లో రెచ్చిపోయిన ఎమ్మెల్సీ కవిత...
kavitha fires on pm modi: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా రెచ్చిపోయారు. మోదీ సర్కారులో.. అదానీకో న్యాయం.. ఆడదానికి మరో న్యాయమా.. అంటూ ఎక్స్ లో సంచలనపోస్ట్ పెట్టారు.
kavitha sensational post on gautam adani controversy: ప్రస్తుతం దేశంలో గౌతమ్ అదానీ ఘటన రాజకీయాల్లో కాకరేపుతుందని చెప్పుకొచ్చు. గౌతమ్ అదానీపై లంచం, మోసాల ఆరోపణలపై అమెరికాలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. దాదాపు 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. దీనిపై ప్రస్తుతం వివాదం నెలకొంది. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఇప్పటికే డిమాండ్ చేస్తుంది.
మరోవైపు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం మోదీ తీరును ఏకీ పారేశారు. మోదీకి చిత్తశుద్ది ఉంటే.. వెంటనే.. సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయించాలన్నారు. మరొవైపు మోదీ అదానీకి కొమ్ముకొస్తున్నారని... అన్నారు. ఆయనను అరెస్ట్ చేయరని కూడా మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గౌతమ్ అదానీ వ్యవహారంపై మండిపడ్డారు.
అమెరికాలో సౌరశక్తి సరఫరా ఒప్పందాల కోసం యూఎస్ అధికారులకు.. అదానీ గ్రూప్ 260 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించారనే ఆరోపణలు బయటకు వచ్చాయి. దీనివల్ల రెండు బిలియన్ డాలర్ల ఆదాయం పొందే విధంగా మోసాలకు తెరలేపారని అమెరికా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటన రచ్చగా మారింది.
ఈ నేపథ్యంలో ఆమె ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. అఖండ భారత దేశంలో అదానికి ఒక న్యాయం, ఆడదానికి మరో న్యాయమా.. అంటూ మండిపడ్డారు. మరోవైపు కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలయ్యాక చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాకరేపుతున్నాయి.
ఆడబిడ్డను కాబట్టి తనను అరెస్ట్ చేయడం ఈజీగా అని.. ఆధారాలు ఉన్నకూడా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా.. అంటూ ప్రధాని మోదీని కవిత ఏకీపారేశారు. ప్రధాని మోదీని ఎన్నిసార్లు ప్రశ్నించిన కూడా.. అదానీకే ఆయన సపోర్ట్ ఉంటుందని కూడా కవిత సెటైర్ లు వేశారు. ప్రస్తుతం కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.