Kamareddy Crime News: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. తన సొంత అక్కపై ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఆమె నిద్రిస్తున్న సమయంలో మరుగుతున్న నూనెను ముఖంపై పోసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో షేక్ చాందిని, నాగూర్‌బీ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు చాలాకాలంగా నివసిస్తున్నారు. ఈ ఇద్దరికీ పెళ్లిళ్లయినప్పటికీ వైవాహిక జీవితంలో గొడవల కారణంగా భర్తలతో వేరుగా ఉంటున్నారు. ఇదే క్రమంలో చాందినికి కొద్దిరోజుల క్రితం శ్రీనివాస్ అనే స్థానిక వ్యక్తితో పరిచయం ఏర్పడింది.


అదే శ్రీనివాస్‌తో నాగూర్‌బీ కూడా చనువుగా ఉండేది. అయితే శ్రీనివాస్‌తో తన అక్క చాందిని చనువుగా ఉండటాన్ని నాగూర్‌బీ తట్టుకోలేకపోయింది. చాందినిపై లోలోపలే ఆగ్రహంతో రగిలిపోయిన నాగూర్‌బీ.. మంగళవారం (మార్చి 22) ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దారుణానికి ఒడిగట్టింది. మరుగుతున్న నూనెను ఆమె ముఖంపై పోసింది. దీంతో తీవ్ర గాయాలతో చాందిని తల్లడిపోయింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఆస్తుల గొడవ... సోదరి కుటుంబంపై సోదరుడి కుటుంబం దాడి :


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో పుత్లీబాయి అనే మహిళ కుటుంబంపై ఆమె సోదరుడు బోజ్యలాల్ కుటుంబం దాడికి పాల్పడింది. కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. దాడిలో పుత్లీబాయి, ఆమె భర్త, కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుత్లీబాయి భర్త పెరుమాళ్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పుత్లీబాయి, బోజ్యలాల్ మధ్య నెలకొన్న ఆస్తి తగాదాలే ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది.  


Also Read: Paritala Sunitha: ఆ కంపెనీ నుంచి వైసీపీ ఎమ్మెల్యే రూ.15 కోట్లు డిమాండ్ చేశాడు.. పరిటాల సునీత సంచలన ఆరోపణలు 


Also Read: INDW vs BANW: బ్యాటింగ్‌లో తడబడిన భారత్.. బంగ్లాదేశ్‌కు ఈజీ టార్గెట్! గెలిస్తేనే మిథాలీ సేన నిలిచేది!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook