Bhadradi Kothagudem: ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగూడెం కలెక్టర్ భార్య ప్రసవం

Collector Anudeep wife delivery: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తన భార్య మాధవికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించారు. అనుదీప్ నిర్ణయంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా అనుదీప్ దంపతులకు అభినందనలు తెలియజేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2021, 12:38 PM IST
  • కలెక్టర్ అనుదీప్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం
    భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన కలెక్టర్ సతీమణి
    కలెక్టర్ దంపతుల నిర్ణయంపై సర్వత్రా అభినందనలు
Bhadradi Kothagudem: ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగూడెం కలెక్టర్ భార్య ప్రసవం

Collector wife delivery in govt hospital : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యమంటే ఇప్పటికీ చాలామందిలో ఒక తెలియని అపనమ్మకం, రిస్క్ చేస్తున్నామా అనే ఆందోళన వెంటాడుతుంటాయి. అందుకే లక్షల రూపాయలు వెచ్చించైనా సరే ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతుంటారు. ప్రజా ప్రతినిధులు సైతం సర్కారీ వైద్యం కంటే కార్పోరేట్ వైద్యానికే మొగ్గుచూపడం ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల చిన్నచూపును చెప్పకనే చెబుతున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చేందుకు అడపా దడపా కొంతమంది అధికారులు ప్రయత్నిస్తుంటారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) కలెక్టర్ తన భార్యకు  ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేయించారు.

కలెక్టర్ అనుదీప్ (Collector Anudeep Durishetty) భార్య మాధవీ భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. మంగళవారం (నవంబర్ 9) అర్ధరాత్రి సమయంలో పురిటి నొప్పులు రావడంతో కలెక్టర్ అనుదీప్ మాధవిని ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి రాత్రి ఒంటిగంట సమయంలో సిజేరియన్ ద్వారా ప్రసవం చేశారు. ప్రసవ అనంతరం తల్లీ,బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

పండంటి మగబిడ్డ జన్మనించడంపై కలెక్టర్ అనుదీప్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.ప్రెగ్నెన్సీ (Pregnancy) నుంచే మాధవి ఏరియా ఆసుపత్రికి వెళ్లి అక్కడి గైనకాలజిస్టులతో (Gynocology) వైద్య  పరీక్షలు చేయించుకుంటున్నారని స్థానిక వైద్య సిబ్బంది తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించేలా కలెక్టర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. అనుదీప్ నిర్ణయంపై మంత్రి హరీశ్ రావు (Harish Rao) ట్విట్టర్‌లో అభినందనలు తెలియజేశారు.'తల్లి,శిశువు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. సమర్థుడైన సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి.దీంతో ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులే మొదటి ఛాయిస్‌గా మారాయి.' అని హరీశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. నిన్నటిదాకా సీఎం కేసీఆర్ పర్యవేక్షించిన వైద్యారోగ్య శాఖను తాజాగా హరీశ్ రావుకు అప్పగించిన సంగతి తెలిసిందే.

Also Read:Harish Rao: హ‌రీశ్ రావుకు వైద్యారోగ్య‌ శాఖ అప్పగింత

గతంలో భూపాలపల్లి (Bhupalapally) జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన ఆకునూరి మురళి (Akunuri Murali) తన కూతురికి ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించిన సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే అవకాశం ఉన్నా... తన కుమార్తెను ప్రభుత్వ ఆసుపత్రికే (Government hospital) తీసుకెళ్లారు. మురళి కుమార్తెకు థైరాయిడ్ సమస్య ఉన్నందునా.. ప్రసవం క్రిటికల్ అవొచ్చునని వైద్యులు హెచ్చరించారు. అయినప్పటికీ మురళి ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించాలని నిర్ణయించారు. వైద్యులు సిజేరియన్ చేయడంతో మురళి కుమార్తె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఏజెన్సీ ప్రాంత వాసుల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో మురళి వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News