Kavitha Comments on Manickam Tagore: కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌పై... టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత సీరియస్ అయ్యారు. ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాలతో తెలంగాణ రాలేదంటూ ఆమె ఫైర్ అయ్యారు. కేసీఆర్.. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల వల్లే  తెలంగాణ రాష్ట్రం వచ్చింద్నారు. అది ఎవరి గిఫ్ట్‌కాదంటూ క‌విత మండిపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రజా ఆగ్రహానికి తలొగ్గే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారంటూ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. అప్పటి ఉద్యమ నేతలు... కేసీఆర్ నేతృత్వంలో ప్రజా ఉద్యమం చేపట్టడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిదంటూ ఎమ్మెల్సీ కవిత అన్నారు.


అహింసా మార్గంలో కేసీఆర్ చేపట్టిన పోరాటం వల్ల  ప్రజలంతా కలిసి వచ్చి... అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచడం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. అది ఎవరి భిక్ష కాదంటూ ఆమె ఫైర్ అయ్యారు. 


కేసీఆర్‌‌ ఆధ్వర్యంలో కొనసాగిన ప్రజా పోరాటంలో చివరకు సత్యమే గెలిచిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భారత మాజీ ప్రధానిని, వారి కుటుంబాన్ని అసోం సీఎం హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అన్నందుకే.. రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్‌‌ స్పందించారన్నారు. అందువల్లే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. అది కేసీఆర్ స్థాయి అంటూ ఎమ్మెల్సీ క‌విత స్పష్టం చేశారు. మళ్లీ ఎప్పుడైనా కేసీఆర్‌‌పై కామెంట్స్‌ చేసే ముందు కాస్త ఆలోచించుకుని చేయడంటూ క‌విత హితవు పలికారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. 



 


అయితే మొదట మాణిక్కం ఠాగూర్‌‌.. తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ టీమ్‌తో పాటు కోట్లాది మంది తెలంగాణ యూత్.. సోనియాగాంధీ కోరుకున్నటువంటి  తెలంగాణ కోసం పని చేస్తుందన్నారు. కానీ ఈ ఏడేళ్లలో అలా ఏమీ జరగలేదన్నారు. టీఆర్‌ఎస్.. బీజేపీలను ఓడిస్తేనే అది నెరవేరుతుందన్నారు. ఇక ట్వీట్‌కు కౌంటర్‌‌గా ఎమ్మెల్సీ కవిత మరో ట్వీట్‌ చేశారు.


Also Read: Balayya Love Tips: అమ్మాయిని ఎలా పటాయించాలో చెప్పిన బాలయ్య!


Also Read: Investors lose: ఒక్క రోజులో రూ.8.5 లక్షల కోట్ల సంపదను తుడిచేసిన నష్టాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook