KCR Biopic: నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలిచే వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు మళ్లీ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం కే చంద్రశేఖర్ రావు బయోపిక్ తెరకెక్కిస్తానని ఆర్జీవీ ప్రకటన చేశారు. నిజ జీవితం ఆధారంగా రూపొందించే సినిమా కావడం వల్ల ఆ చిత్రానికి పెద్దగా కష్టమేం కాదని ఆయన అన్నారు. కేసీఆర్ బయోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్ తన బుర్రలో ఉందని తెలిపారు. ఆయన రూపొందిన 'డేంజరస్' సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ మాట అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ భవనంలో గురువారం 'డేంజరస్' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు 2018లో కీలక తీర్పునిచ్చింది. ఆ కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు ఈ 'డేంజర్' చిత్రం రూపొందించినట్లు డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. 


ఇద్దరు యువతుల మధ్య ప్రేమ నేపథ్యంలో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అయితే స్వలింగ సంపర్కాన్ని సమాజం ఇప్పుడిప్పుడే అంగీకరిస్తుందని ఆర్జీవీ అన్నారు. ఏప్రిల్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఓటీటీలోనూ విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.   


Also Read: Alia Bhatt RRR: దయచేసి అసత్య ప్రచారాల్ని సృష్టించవద్దు.. అందుకే ఆర్ఆర్ఆర్ ఫోటోలు డిలీట్ చేశా: అలియా భట్‌


Also Read: Rakul Preet Photos: షార్ట్ డ్రస్సులో హార్ట్ బీట్ పెంచేస్తున్న రకుల్ ప్రీత్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook