KCR Datti Contraversy: తెలంగాణ సీఎం కేసీఆర్ దట్టీ ధరించి అత్యంత పవిత్రమైన కొల్హాపూర్ ఆలయానికి వెళ్లడం వివాదాస్పదమవుతోంది. ఓ వర్గం వారు పాటించే సంప్రదాయంతో హిందూ ఆలయంలోకి ఎలా వెళతారంటూ కొందరు  ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా దర్గాలకు వెళ్లేటప్పుడు దట్టీలు ధరిస్తారని వారు గుర్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చర్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అష్టాదశ శక్తిపీఠాల్లో ఏడవది కొల్హాపూర్. అక్కడ మహాలక్ష్మీ దేవి స్వయంభూగా వెలిసిందని భక్తుల నమ్మకం. సతీసమేతంగా కొల్హాపూర్ మహాలక్ష్మి అంబాబాయ్‌ని దర్శించుకున్న కేసీఆర్ దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అంబాబాయ్ అలంకార పూజలో కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలోనూ కేసీఆర్ దట్టీతోనే కనిపంచడాన్ని కొందరు హిందుత్వవాదులు తప్పు పడుతున్నారు. ఆలయంలో ఉన్న కాసేపైనా ఆ వస్త్రాన్ని తొలిగించొచ్చు కాదా అని ప్రశ్నిస్తున్నారు. 



ఏ సభకు వెళ్లినా సీఎం కేసీఆర్ దట్టీని ధరించే వెళతారు. తాను ఎక్కిడికి వెళ్లినా ముస్లిం సోదరులు తనకు దట్టీ కట్టి.. క్షేమంగా వెళ్లి లాభంగా రండని ఆశీర్వదిస్తారని సీఎం కేసీఆర్ ఓ సారి స్వయంగా వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉట్నూరులో తొలిసారి తనకు ఓ ముస్లిం దట్టీ కట్టారని గుర్తు చేసుకున్నారు. మక్కాలో మహమ్మద్ ప్రవక్త మనవడు ... ఓ జింకకు దట్టీ కట్టిన కథను కూడా కేసీఆర్ అప్పట్లో ప్రస్తావించారు. దట్టీ చాలా పవిత్రమైనదిగా తాను భావిస్తున్నానని కేసీఆర్ పదే పదే ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి.


తనను చూసే చాలా మంది దట్టీ కట్టుకుంటున్నారని కూడా కేసీఆర్ చెప్పుకున్నారు. కేసీఆర్ అప్పట్లో చెప్పిన మాటలను హిందుత్వ వాదులు గుర్తు చేస్తున్నారు. ఇతర మతాల సంప్రదాయం ఆలయాల్లో పాటించడాన్ని తప్పుపడుతున్నారు. 


Also Read: Mumbai Indians Players: ఐదుసార్లు విజేతగా ముంబయి ఇండియన్స్.. ఈసారి టీమ్ లో ఎవరెవరు?


Also Read: AP Assembly: మూడు రాజధానులు, శాసన వ్యవస్థ వర్సెస్ న్యాయవ్యవస్థపై ఏపీ అసెంబ్లీలో చర్చ..ఎవరేమన్నారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook