Mumbai Indians Players: మరికొద్ది గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. టోర్నీలో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ క్రమంలో టోర్నీ కోసం ఇతర జట్లు కూడా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు 5 సార్లు విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్ టీమ్.. ఈసారి కూడా ఫేవరేట్ గా బరిలో దిగనుంది. అయితే ఈ టీమ్ ను విజేతగా నిలపడంలో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ఎంతో కీలకంగా ఉంది.
ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి టీ20 స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. 2013లో రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా ఎంపికైన తర్వాత.. ఆ జట్టు 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిల్స్ ను నెగ్గింది.
అయితే ప్రస్తుత సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో డెవాల్డ్ బ్రెవిస్, ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, టైమల్ మిల్స్, డానియన్ సామ్స్, అర్జున్ టెండూల్కర్‌లను జట్టులో చేర్చుకుంది.
ముంబై ఇండియన్స్ టీమ్ ఆటగాళ్ల జాబితా..
1) రోహిత్ శర్మ (కెప్టెన్)
2) సూర్యకుమార్ యాదవ్ (బ్యాటర్)
3) డెవాల్డ్ బ్రెవిస్ (బ్యాటర్)
4) తిలక్ వర్మ (బ్యాటర్)
5) రమణదీప్ సింగ్ (బ్యాటర్)
6) రాహుల్ బుద్ధి (బ్యాటర్)
7) అన్మోల్ ప్రీత్ సింగ్ (బ్యాటర్)
8) ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, బ్యాటర్)
9) ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్, బ్యాటర్)
10) కిరన్ పొలార్డ్ (ఆల్ రౌండర్)
11) డానియన్ సామ్స్ (ఆల్ రౌండర్)\
12) సంజయ్ యాదవ్ (ఆల్ రౌండర్)
13) టిమ్ డేవిడ్ (ఆల్ రౌండర్)
14) ఫాబియన్ అలెన్ (ఆల్ రౌండర్)
15) అర్జున్ టెండూల్కర్ (ఆల్ రౌండర్)
16) హృతిక్ షోకీన్ (ఆల్ రౌండర్)
17) జస్ప్రీత్ బుమ్రా (ఫాస్ట్ బౌలర్)
18) జోఫ్రా ఆర్చర్ (ఫాస్ట్ బౌలర్)
19) టైమల్ మిల్స్ (ఫాస్ట్ బౌలర్)
20) అర్షద్ ఖాన్ (ఫాస్ట్ బౌలర్)
21) జయదేవ్ ఉనద్కత్ (ఫాస్ట్ బౌలర్)
22) రిలే మెరెడిత్ (ఫాస్ట్ బౌలర్)
23) బాసిల్ థంపి (ఫాస్ట్ బౌలర్)
24) మయాంక్ మార్కండేయ (స్పిన్నర్)
25) మురుగన్ అశ్విన్ (స్పిన్నర్).
ALso Read: IPL 2022: కేకేఆర్ మూడు ముచ్చట తీరుతుందా..??
Also Read: Virat Kohli Join RCB: ఇన్ని సంవత్సరాలు ఐపీఎల్ ఆడుతానని అనుకోలేదు: కోహ్లీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook