AP Assembly: ఏపీలో గత కొద్దికాలంగా చర్చనీయాంశమవుతున్న అధికార వికేంద్రీకరణపై చర్చ ప్రారంభమైంది. మూడు రాజధానుల అంశంపై చర్చకు అనుమతించడంతో సభ్యులు మాట్లాడారు. రాజ్యాంగం ఆధారంగానే పాలన కొనసాగుతుందని సభలో సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. శాసన సభ, న్యాయవ్యవస్థ అధికారాలు, అధికార వికేంద్రీకరణపై చర్చ జరగాలంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపాదన మేరకు చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనుమతిచ్చారు. ఈ అంశంపై ముందుగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు.
ధర్మాన ప్రసాదరావు..
జ్యుడీషియల్ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించకూడదని రాజ్యాంగం చెప్పింది. అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. శాసనవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే..ప్రజలు చూసుకుంటారు. అంతేగాని..శాసనవ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టులు ఎంత నిగ్రహంతో వ్యవహరించాలో కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే విషయాన్ని కోర్టులు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకు సమాన హక్కులు, అధికారాలున్నాయి. లేని అధికారాల్ని కోర్టులు సృష్టించుకోకూడదని సుప్రీంకోర్టు తీర్పుల్లో స్పష్టంగా ఉంది. ఎవరి పరిధి ఏంటి, ఎవరి విధులేంటనే విషయంపై స్పష్టత రావాలి. లేకపోతే వ్యవస్థలో గందరగోళం నెలకొంటుంది. ఏపీ అసెంబ్లీకు కొన్ని పరిమితులు పెట్టింది హైకోర్టు. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయకూడదని చెప్పింది. అందుకే ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చించి..సభలో చర్చించాలని సభా నాయకుడికి లేఖ రాశాను. ఒకరి విధి నిర్వహణలో మరొకరు జోక్యం చేసుకోవద్దు. రాజ్యాంగ బాధ్యతల్ని నెరవేర్చకుండా అడ్డుపడవద్దు. న్యాయ, కార్య నిర్వాహక, శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాలి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల అని రాసుకుంది శాసన వ్యవస్థ గురించే. రాజ్యాంగంలో ఉన్నది కూడా ఇదే.
బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి..
ప్రాధమిక హక్కులపై రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. ఒకరి హక్కుల్ని మరొకరు లాక్కోకూడదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు అన్ని రంగాల్లో వెనుకబడ్డాయి. అందుకే అధికార వికేంద్రీకరణ జరగాలని చెబుతున్నాం
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..
ఏ వ్యవస్థకైనా స్వీయ నియంత్రణ అవసరం. న్యాయవ్యవస్థ మంచి గురించే మాట్లాడుతున్నాను. ప్రతి వ్యవస్థకూ కొన్ని పరిధులు ఉంటాయి. దేశానికి సుప్రీం రాజ్యాంగమే. న్యాయవ్యవస్థ అంటే మాకు చాలా గౌరవం. న్యాయమూర్తుల తప్పులపై విచారణ జరిపే అధికారం రాష్ట్రపతి ఆధ్వర్యంలోని వ్యవస్థకు ఉండాల్సిందే. న్యాయమూర్తుల ఎంపిక కూడా యూపీఎస్‌సీ తరహాలో జరగాలి.
ఎమ్మెల్యే పార్ధ సారధి..
రాజధాని లేకుండా ఏపీను విభజించారు. మూడు రాజధానుల అంశం కులాల సమస్య కానేకాదు. ప్రాంతాల మధ్య సమతుల్యత ఇది. రాజధాని పేరుతో దోచుకోవడమే చంద్రబాబు లక్ష్యం. పరిపాలన రాజధానిగా విశాఖపట్నాన్ని నిర్ణయిస్తే తప్పేముంది. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా హైకోర్టు ఏర్పాటు చేస్తే నష్టమేంటి.
Also read: Urdu Language: ఏపీ రెండవ అధికారి భాషగా ఉర్దూ, ఆమోదించిన రాష్ట్ర అసెంబ్లీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook