CM KCR:  కేంద్ర  ప్రభుత్వంపై కొంత కాలంగా దూకుడుగా వెళుతున్న సీఎం కేసీఆర్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు తీసుకున్న విధానాలకు ఫాలో అయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై రాష్ట్రంలో ఆంక్షలు విధించారు. తెలంగాణలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలో దర్యాప్తు కోసం గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 51ను విడుదల చేసింది. ఆగస్ట్ 31నే తెలంగాణ హోం శాఖ దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్ సర్కార్ తాజా నిర్ణయంపై ఇకపై రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఇదే రకంగా నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నాటి చంద్రబాబు ప్రభుత్వం రాజకీయంగా విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో సీబీఐ అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది.


ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1946 సెక్షన్‌ ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో సీబీఐ ద‌ర్యాప్తు నిర్వ‌హించాలనుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. ప‌శ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, మేఘాల‌య‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌ గ‌ఢ్‌తోపాటు మొత్తం 9  తొమ్మిది రాష్ట్రాలలో ప్రస్తుతం సీబీఐపై ఆంక్షలు ఉన్నాయి. విచారణ సంస్థల పేరుతో రాజకీయ వేధింపులకు దిగుతున్నారనే కారణంతో ఆయా రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తు చేయాల్సి ఉండి.. స్థానిక ప్రభుత్వాలు అనుమతించపోతే న్యాయస్థానం ద్వారా సీబీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా విచారణ చేసుకోవచ్చు.


ఆగస్టులో బీహార్ వెళ్లారు సీఎం కేసీఆర్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను కలిశారు. ఆ సమయంలో బీహార్ లో  సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం నితీష్ కుమార్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ సమర్ధించారు. మిగిలిన ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.  అందులో భాగంగానే  అదే రోజు అంటే ఆగస్టు 31నే రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది. అయితే ఆ జీవోను రహస్యంగా ఉంచారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పెద్ద యుద్దమే సాగుతోంది. ఫాంహౌజ్ లో జరిగిందంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని బండి సంజయ్ సహా కమలం నేతలు ఆరోపిస్తున్నారు. అడ్డంగా దొరికిన దొంగలు.. ఏదైనా మాట్లాడుతారంటూ మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు.


ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలోని ప్రముఖుల పేర్లు వినిపిస్తుండటం, నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ పెద్దల దూతలు సంప్రదింపులు జరిపారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.


Read Also: హీరోయిన్ దెబ్బకు 149 మంది మృతి.. వందల మంది ఆసుపత్రి పాలు!


Read Also: CM KCR MUNUGODE MEETING LIVE UPDATES : ఎమ్మెల్యేల బేరసారాలపై కేసీఆర్ బ్లాస్టింగ్! చండూరు సభలో ఏడుస్తారంటున్న బండి సంజయ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి