CM KCR SPEECH : నూకలు తినమన్నోడి తోకలు కత్తిరిద్దాం.. మునుగోడు సభలో బీజేపీపై కేసీఆర్ విశ్వరూపం

CM KCR MUNUGODE MEETING:చండూరులో సభలో కేసీఆర్ చేయబోయే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాలుగు రోజుల క్రితం వెలుగులోనికి వచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించి గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Last Updated : Oct 30, 2022, 05:13 PM IST
 CM KCR SPEECH : నూకలు తినమన్నోడి తోకలు కత్తిరిద్దాం.. మునుగోడు సభలో బీజేపీపై కేసీఆర్ విశ్వరూపం
Live Blog

CM KCR MUNUGODE MEETING:  మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నలుగురు ఫాంహౌజ్ ఎమ్మెల్యేలను సభకు తీసుకువచ్చారు కేసీఆర్. వాళ్లను జనాలకు పరిచయం చేస్తూ తెలంగాణ పులి బిడ్డలుగా చెప్పారు. సీఎం సభకు  భారీగా జన సమీకరణ చేసింది.  చండూరులో సభలో బీజేపీపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. ప్రధాని మోడీ విశ్వగురువు కాదు విష గురువు అని మండిపడింది.

30 October, 2022

  • 16:43 PM

    సిలిండర్ ధరను 12 వందలు చేసింది ఎవరు

    పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచింది ఎవడు

    ఇవన్ని చూస్తు కూడా బీజేపీకి ఓటేయాల్నా

    కరెంట్ కు కార్పొరేట్లకు అప్పగించే కుట్ర జరుగుతోంది

    జనాల మీదకు కార్పొరేట్ గద్దలను పంపిస్తోంది కేంద్రం

    వడ్లు కొన చేతకాదు వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొంటరు

    మోడీ విశ్వగురువు కాదు విశ గురువు

     

  • 16:26 PM

    విద్యుత్ సంస్కరణల ముసుగులో మీటర్లు పెడుతున్నారు

    మీటర్ పెడుతామంటున్న మోడీకి మీటర్ పెట్టాలి

    ఓటు జ్రాగత్తగా వేయాలి.. లేదంటే పెట్టుబడి దారులు వాలిపోతరు

    తెలంగాణను కబ్జా పెట్టాలని ఢిల్లీ పెద్దల కుట్ర

     

  • 16:19 PM

    తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదు

    కొంత మంది ఢిల్లీ బ్రోకరు గాళ్లు తెలంగాణను కొందామని వచ్చారు

    ప్రధాని మోడీ ఎందుకీ అరాచకాలు

    వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి

    మోడీ గారు మీకు ఇంకా ఏం కావాలి

     

  • 16:15 PM

    ఉప ఎన్నిక ఫలితం ఎప్పుడో తేలిపోయింది - కేసీఆర్

    ఒళ్లు మర్చిపోయి ఓటేస్తే ఇళ్లు కాలిపోతుంది- కేసీఆర్

    నాతో పాటు నలుగురు తెలంగాణ పులి బిడ్డలు వచ్చారు- కేసీఆర్

  • 16:01 PM

    చండూరు బహిరంగ సభా స్థలికి చేరుకున్న సీఎం కేసీఆర్

    కేసీఆర్ తో పాటు వచ్చిన ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి..
    గువ్వల బాలరాజు, రేగా కాంతారావు

     

  • 15:38 PM

    అమిత్ షా దేశానికి హోంమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం- సాంబశివరావు

    బీజేపీని తరమికొడితేనే దేశానికి మంచి జరుగుతుంది- సాంబశివరావు

    శ్రీలంక అధ్యక్షుడిని తరిమేసినట్లు మోడీని తరిమేయాలి- సాంబశివరావు

  • 15:07 PM

    సీఎం కేసీఆర్ తో పాటు చండూరు సభకు ఫాంహౌజ్ నలుగురు ఎమ్మెల్యేలు

    ఎమ్మెల్యేల బేరసారాలపై కేసీఆర్ మాట్లాడే అవకాశం

    బీజేపీని తీవ్ర స్థాయిలో కేసీఆర్ టార్గెట్ చేసే అవకాశం

    చండూరు సభలో కేసీఆర్ ప్రసంగంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి

    చండూరు సభలో కేసీఆర్, కేటీఆర్ ప్రమాణం చేయాలంటున్న బండి సంజయ్

  • 14:23 PM

    గులాబీ మయమైన చండూరు

    కేసీఆర్ సభకు భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు

    కాసేపట్లో చండూరు వెళ్లనున్న సీఎం కేసీఆర్

    కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ

  • 12:40 PM

    కేసీఆర్ చండూరు సభపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

    చండూరు సభలో కేసీఆర్ ఏడవబోతున్నారు..

    సెంటిమెంట్ రగిలించి మునుగోడులో గెలవాలని చూస్తున్నారు

    రాజగోపాల్ రెడ్డి విసిరిన సవాల్ స్వీకరించే ధమ్ము కేసీఆర్ కు ఉందా

    నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ చండూరు సభకు తీసుకువెళుతున్నారు

  • 12:28 PM

    సీఎం కేసీఆర్ చండూరు సభ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు జనాలు. అయితే ఫాంహౌజ్ డీల్ కేసులో మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు దర్యాప్తు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో చండూరు సభలో ఈ అంశాన్ని కేసీఆర్ ప్రస్తావిస్తారా లేదా అన్నది చర్చగా మారింది. టీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఎమ్మెల్యేల బేరసారాలపై కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడుతారని చెబుతున్నారు.

     

Trending News