హైదరాబాద్ : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లాలోని సుప్రసిద్ద మన్యం కొండ బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 04 నుండి 13 వరకు పదిరోజులపాటు అత్యంత వైభవోపేతంగా జరిగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని  ఆహ్వానిస్తూ..  దేవదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆహ్వాన ప్రతికను అందచేశారు. ఆహ్వానించిన వారిలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూధన్ తదితరులు కూడా వున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన్యం కొండ స్థల పురాణం :


మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 20 కిలో మీటర్ల దూరంలో మన్యం కొండ దివ్య క్షేత్రం వుంది. దాదాపు 800 ఏండ్లకింద అలహరి వంశీయుల క్రుషితో.. ఉలిముట్టని విగ్రహంతో .. కట్టని గుడితో.. చెయ్యని పాదాలతో తప్వని కోనేరు కలిగి ప్రకృతికి సహజ సిద్దమైన కొండలలో శ్రీ లక్ష్మీసమేత వెంకటేశ్వర స్వామి స్వయంభువుగా వెలిసినాడని ప్రతీతి. కోరిమొక్కిన భక్తులకు తరగని వరాలిచ్చే శ్రీ లక్ష్మీ సమేత మన్యం కొండ వెంకటేశ్వరస్వామి తెలంగాణ తిరుపతి వెంకన్నగా భక్తులచేత కొనియాడబడుచున్నారు.


చరిత్ర
కేశవయ్య అనే మునికి వెంకటేశ్వరస్వామి కలలో కనిపించి మన్యంకొండ గుహలో తాను వెలిసి ఉన్నానని, నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటూ అంతర్థానం అయ్యారని స్థలపురాణం తెలుపుతుంది. ఆ తర్వాత కేశవయ్య మన్యంకొండను ప్రచారంలోకి తెచ్చాడు. ఆ తరువాత చాలా సంవత్సరాలకు ఎత్తయిన కొండపై ఘాట్‌రోడ్ నిర్మించి ప్రస్తుత స్థితిలోకి తీసుకువచ్చినవాడు అలహరి రామయ్య. కోనేరు, మంచినీటి బావిని కూడా నిర్మించాడు. ప్రారంభంలో మునులు తపస్సు చేసే స్థలం కాబట్టి మునులకొండగా పిలువబడిననూ కాలక్రమేణా పేరు మన్యంకొండగా స్థిరపడింది.



రెండవ తిరుపతి
మన్యంకొండ దేవస్థానం రెండవ తిరుపతిగా పేరుగాంచింది. తీరితే తిరుపతి.. తీరకుంటే మన్యంకొండ అన్నట్లు.. పాలమూరు పేదలు దూరాన ఉన్న తిరుపతికి వెళ్ళలేనివారు, తీరికలేనివారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో గుట్టపైకి బస్సులు వెళ్తాయి. మామూలు రోజులలో రాయచూరు ప్రధాన రహదారిపై దిగి అక్కడి నుంచి ప్రవేటు వాహనాలను ఆశ్రయించవలసి ఉంటుంది. ఇటీవల కొండపైకి వెళ్ళడానికి ఉన్న ఘాట్‌రోడ్డును డబుల్ రోడ్డుగా మలిచారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..