నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ జాతీయ రాజకీయాలపై స్పందించారు. దేశంలో నాన్ బీజేపీ -నాన్ కాంగ్రెస్  ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. కేంద్రం పెత్తనాన్ని పూర్తిగా నియంత్రించి కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం ఉండేలా ఫ్రంట్ ఉండాలని అభిప్రాయపడ్డారు. నల్గొండ జిలా దేవరకొండలో ఈ రోజు టీఆర్ఎస్ ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న కేసీఆర్ పదునైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై స్పందిస్తూ దేవరకొండ కరువుతో నలిగిపోయిన ప్రాంతం..ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో కృషి చేశామని భవిష్యత్తులో మరిన్ని పథకాల రూపకల్పన చేస్తామన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్ నోట మళ్లీ రిజర్వేషన్ల మాట
దేవరకొండ సభలో సీఎం కేసీఆర్ రిజ్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు అవసరమని..అది కేంద్రం పరిధిలో ఉన్నందున అమలు చేయలేకపోయమన్నారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించినట్లే..ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లు సాధిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. 


చంద్రబాబు అవసరమా ?
ఈ సందర్భంగా చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ తెలంగాణకు ద్రోహం చేసిన ఆ వ్యక్తి మనకు మళ్లీ అవసరమా ? అనిప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ అంధకారరమౌతుందని..జనాలు అన్ని ఆలోచించుకొని ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో మాయ మాటలు చెప్పే కాంగ్రెస్,మహాకూటమి నేతలకు చెంప చెళ్లమనేలా సమాధానం ఇవ్వాలని ప్రజలకు కేసీఆర్ పిలపునిచ్చారు