లోక్‌సభ కు పోటీ చేసే అభ్యర్ధుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్...ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ సారి ఎలాగైన 16 ఎంపీ సీట్లను సాధించాలని టార్గెట్ పెట్టుకున్న కేసీఆర్...ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎంపీలను మార్చే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరగుతోంది. అభ్యర్ధుల ఎంపిక విషయంలో భారీ మార్పులు ఉంటాయని పార్టీ ముఖ్య నేతలకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఒక్క వినోద్ మినహా సీటు విషయంలో కేసీఆర్ ఎవరికీ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కవిత నుంచే మొదలు..


నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవితను కూడా ఈ సారి పక్కన పెట్టే అవకాశముంది. నిన్న జరిగిన నిజామాబాద్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ సిట్టింగ్ ఎంపీ కవిత పేరు ప్రస్తావించ కూడా ఇక్కడ ఎంపీ అభ్యర్ధి ఎవరైనా సరే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వ్యాఖ్యానించారు. ఒకవైపు సిట్టింగ్ ఎంపీ కవిత ఉన్నప్పటికీ ఇలాంటి సంకేతాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కూతురు కవిత పై వేటు వేసి మిగిలిన సిట్టింగులను తిరుగుబాటు చేయకుండా కళ్లెం వేసేందుకు కేసీఆర్ ఈ వ్యూహాం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 


వినోద్, గుత్తా, నామాలకు ఛాన్స్


ప్రముఖ మీడియా కథనం ప్రకారం టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ ను  కరీనంగర్ నుంచి బరిలోకి దించుతారని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ప్రకటించపోయినా ఆయన్ను నల్గొండ ఎంపీ అభ్యర్దిగా బరిలోకి దించుతారని తెలుస్తోంది. అలాగే ఖమ్మం నుంచి  పొంగులేటి సుధాకర్ రెడ్డిని పక్కన పెట్టి సీనియర్ నేత నామా నాగేశ్వరావును ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దించుతున్నట్లు తెలిసింది. గతంలో ఈ స్థానంలో వైసీపీ అభ్యర్ధిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు..అయితే తర్వాతి  పరిణామాలతో ఆయన టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే పొంగులేటికి సీటు కేటాయించేందుకు టీఆర్ఎస్ అధినాయత్వనికి ఇష్టం లేనట్లుగా వార్తలు వస్తున్నాయి.


రేపు తేలనున్న సిట్టింగుల భవితవ్యం


రేపు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధులను ప్రకటించాలని కేసీఆర్ ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. సిట్టింగుల భవితవ్యం ఎలా ఉంటుందనే రేపు తేలిపోనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎవరి సీటు దక్కుతుంది.. ఎవరిపై వేటు పడుతుందనే అంశం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది